టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన శ్రీకాంత్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగులో శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లోనే తనకంటూ సపరేట్గా అభిమానులను క్రియేట్ చేసుకున్నారు. అదే విధంగా లేడీ అభిమానులు కూడా శ్రీకాంత్‌కు అప్పట్లో ఎక్కువగానే ఉండేవారు. ముందుగా విలన్ గా తన కెరీర్‌ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మరిన శ్రీకాంత్ అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. అదే సమయంలో అప్పుడున్న స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
అప్పట్లో శ్రీకాంత్ సినిమా వస్తుంది అంటే ట్రేడ్ వర్గాల్లో మినిమం గ్యారెంటీ అయితే ఉండేది. అయితే గత కొంతకాలంగా శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. అదేవిధంగా స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా కూడా నటిస్తూ భారీ విజయాలను అందుకుంటున్నాడు. బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాలో శ్రీకాంత్ చేసిన విలన్ పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి మహాత్మ సినిమాయే కారణం అంటూ చేప్పుకోచ్చాడు.
శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఆమె.. సినిమా హిట్ అయ్యాక తనకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయని.. అదే సమయంలో తాజ్ మహల్, పెళ్లి సందడి, ఆహ్వానం, వినోదం వంటి సినిమాలు వరుసగా మంచి విజయం సాధించాయి. అప్పటినుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ తర్వాత చేయడానికి మూడు సినిమాలు రెడీగా ఉండేవి… అలా తన కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే తన వందో సినిమా మహాత్మ రిలీజ్ అయ్యాక తన తన కెరీర్ ఒకసారిగా డోన్ ఫాల్ అయిందని చెప్పుకొచ్చాడు. ఇక తాను మహాత్మ సినిమా తర్వాత 25 సినిమాలు చేసిన ఒకటి కూడా సక్సెస్ కాలేదని.. నాకు టైం కలిసి రాలేదని.. అదే సమయంలో కొత్తతరం హీరోలు రావటం కూడా తాను ఈ రేసులో వెనుక పడడానికి కారణం అయిందని శ్రీకాంత్ తెలిపాడు.