ఎస్ ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రిలో స్టార్ హీరోయిన్గా ఎంజాయ్ చేసీ ఇప్పుడు బొక్క బర్ల పడీ చేతిలో ఒక అవకాశం కూడా లేకుండా ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ వేయించుకున్న పూజ హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం.. ఆమె పక్కన వెళ్తున్న సరే ఆమెను పట్టించుకుని పరిస్థితి ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఉంది.
ఎన్ని హాట్ హాట్ ఫోటోషూట్లు చేసినా సరే ప్రేక్షకులు అమెను అసలు పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఇలాంటి పొజిషన్లోకి రావటానికి పూజా హెగ్డేనే కారణం అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. గతంలో వరుస అవకాశాలు వచ్చిన సమయంలో ఆమె ఆలోచించకుండా సినిమాలు చేసి వరుస ప్లాప్లను అందుకుంది అంటూ ఆమె అభిమానులు మండిపడుతున్నారు.
అయితే ఇప్పుడు ప్రస్తుతం అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది ఉంది శ్రీలీల అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు. వరుసగా క్రేజీ ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది శ్రీ లీల.. ఆమె నటించే సినిమాలలో తన పాత్ర ఏంటో కూడా తెలియని రేంజ్ లో ఆమె సినిమాలను ఒప్పుకుంటుంది. ఈ కారణంగానే ఆమె నటించిన ఆదికేశవ,ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, స్కంద సినిమాలు ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి. అంతేకాకుండా ఆమె రాబోయే రోజుల్లో పూజా హెగ్డే పరిస్థితి కన్నా శ్రీలీల దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేస్తున్నారు.