Home Film News FL రివ్యూ: “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” – బొమ్మ దద్దరిల్లింది.. బాక్సాఫీస్‌కు అమ్మ మొగుడు..!
Film NewsReviews

FL రివ్యూ: “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” – బొమ్మ దద్దరిల్లింది.. బాక్సాఫీస్‌కు అమ్మ మొగుడు..!

విడుదల తేదీ : డిసెంబర్ 22, 2023
నటీనటులు: ప్రభాస్, శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, టినూ ఆనంద్, రామచంద్రరాజు, ఐకాన్ సతీష్ తదితరులు
దర్శకుడు : ప్రశాంత్‌ నీల్‌
నిర్మాత: విజయ్‌ కిర్‌గంధూర్‌
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ్
ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి
సెన్సార్ రిపోర్ట్‌: A
ర‌న్ టైం: 172 నిమిషాలు
వ‌ర‌ల్డ్ వైడ్ టార్గెట్‌: రు. 800 కోట్ల ( గ్రాస్ )

Salaar Review: రివ్యూ: సలార్‌.. ప్రభాస్‌ ఖాతాలో హిట్‌ పడిందా? | prabhas salaar movie review in telugu

FL ప‌రిచ‌యం :
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నుంచి వచ్చిన భారీ యాక్షన్ మూవీ సలార్.. కే జి ఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ తెర్కెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా ఎలా మారుమోగుతుందో అందరూ చూస్తూనే ఉన్నాం. కేజీయ‌ఫ్ సీరిస్ నిర్మించిన విజ‌య్ కిర‌గందూరే సలార్‌ సినిమాను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజ‌ర్లు, రెండు టైలర్లు అయితే యూట్యూబ్లో భారీగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాపై ఎవరూ ఊహించని బ‌జ్‌ను క్రియేట్ చేశాయి. ఇటు హీరోయిన్గా శృతిహాసన్… కే జి ఎఫ్ సినిమాలకు పని చేసిన టెక్నికల్ టీం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల భారీ బడ్జెట్.. ఇటు షారుక్ ఖాన్ ఢంకీ సినిమాకు పోటీకి వచ్చిన ఈ మోస్ట్ అవెంటెడ్ యాక్షన్ సలార్ అంచనాలను అందుకుందా.. ప్రభాస్ రేంజ్ కు తగ్గ హిట్ వచ్చిందా లేదో ఇక్కడ చూద్దాం.

కథ:
ఇండియాలో అప్ఘ‌నిస్తాన్‌ను అనుకుని ఓ మూలన ఉండే కాన్సారాను కొన్ని తెగల వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఇక్కడ ఉండే తెగల వాళ్ళు దేశంలో ప్రజల నుంచి దోచుకున్న సంపద, ధనమంతా కాన్సారా లో దాచుకుంటారు. అక్కడ ఉండే మూడు తెగల్లో ఒక తెగకు చెందిన నాయకుడు శివ‌మ‌న్నార్ ఆ రాజ్యాన్ని పాలిస్తాడు. అతని మరణం తర్వాత అతడి కొడుకు జగపతిబాబు ఆ రాజ్యానికి రాజు అవుతాడు. జగతిబాబు కొన్ని సంవత్సరాలు ఈ తెగలను ఏకం చేసి దొరగా ఏలుతాడు. అయితే జగపతిబాబు తన సామ్రాజ్యానికి తన కుమార్తె శ్రీయ రెడ్డిని వారసురాలిగా చేయాలనుకుంటాడు. అయితే అదే మన్నార్ వంశానికి చెందిన వ‌ర‌ద రాజ‌మ‌న్నార్ ( పృథ్విరాజ్‌) కూడా ఈ రేస్ లో ఉంటాడు. అయితే ఈ ఆధిపత్యం పోరూలో తన స్నేహితుడు వరదరాజు మన్నార్‌ను రాజును చేసేందుకు వన్ మ్యాన్ ఆర్మీల పోరాటం చేసిన దేవా(ప్రభాస్) తో అతనికి ఎందుకు వైరం వచ్చింది..? ఇక వరద తన స్నేహితుడు దేవాను ఎందుకు చంపాల‌నుకుంటాడు ? ఇక చివరిలో ఏమైంది అన్నదే సలార్‌ మొదటి భాగం ఒక స్టోరీ.

Salaar First Review | Salaar Review | Salaar Movie Review | Prabhas - Prithviraj Salaar Telugu Movie Review | Salaar Ratings - Filmibeat

విశ్లేష‌ణ & డైరెక్ష‌న్ ఎనాల‌సిస్ :
ఈ సినిమా కథపరంగా చెప్పాలంటే ఇద్దరు ప్రాణ మిత్రులకు సంబంధించిన కథ.. ప్రాణ స్నేహితులైన దేవా(ప్రభాస్) వరదరాజమన్నార్‌(పృధ్విరాజ్) ఎందుకు శత్రువులుగా మారారు.. వీరి యుద్ధంలోకి హీరోయిన్ శృతిహాసన్ ఎలా వచ్చింది..? అదేవిధంగా ఆమెతోపాటు ఆమె తండ్రిని ఎందుకు చంపాలనుకున్నారు..? ఈ కథలో హీరో తల్లి ఈశ్వరి రావ్, ఝాన్సీ ప్రాతల ప్రాధాన్యం ఏంటన్నది ట్విస్ట్.

ఇక ఈ సినిమా మొదటి భాగంలో ప్రభాస్ కు ఎలివేషన్లు ఇస్తూ వెళ్లిన దర్శకుడు ప్రశాంత్.. పృధ్విరాజ్- ప్రభాస్ మధ్యన శత్రుత్వం ఉన్నట్టు చూపించిన కారణం ఏంట‌న్న‌ది చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. అదేవిధంగా శృతిహాసన్ ను కాపాడటం,ఆమె కోసం విలన్స్ తో ఫైట్ చేసి ఆమెను అక్కడ నుంచి తీసుకు వెళ్లే క్రమంలో అక్కడ ఆమెకు కాన్సార గురించి చెప్పడమే సెకండ్ హాఫ్ మొత్తం నడుస్తుంది. ఈ సినిమా మొదటి భాగంలో ఆ పాత్రల పరిచయం కథలోకి వెళ్లేందుకు కొంత టైం తీసుకున్న.. ఇక సెకండాఫ్ లో మాత్రం దర్శకుడు ప్రశాంత్ నిల్‌ తన మ్యాజిక్ తో రచ్చ రచ్చ చేశాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రతి సీన్ కు ఇచ్చిన ఎలివేషన్ అంతా ఇంతా కాదు. క్లైమాక్స్ లో ప్రభాస్- పృథ్వీరాజ్ కలిసి చేసే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి.

ఇక దర్శకుడుగా ప్రశాంత్ నీల్‌ భారతీయ సినిమాకు మరో భారీ సినిమాను పరిచయం చేశాడు. ఇంకా చెప్పాలంటే కేజిఎఫ్ సినిమాలు ఇప్పుడు సలాడ్ చూశాక భారతీయ‌ సినిమాకు సరికొత్త స్టైల్ టేకింగ్ ను పరిచయం చేశాడని చెప్పాలి. ఒక కొత్త దారిని పరిచయం చేయటం గొప్ప కాదు.. ఆ దారిలో తనతోపాటు అందరిని తీసుకు వెళ్ళటంం గొప్ప.. ఇక్కడ ప్రశాంత్ తన టేకింగ్ తో ప్రేక్షకులు చేత అరుపులు తెప్పించాడు. తనదైన టేకింగ్ తో సలార్ సినిమాతో మరోసారి తానేంటో చూపించడు. మామూలు సన్నివేశాన్ని కూడా ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడం లేదా ఎవరి ఊహలుకు అందనంతా హై రేంజ్ లో చెప్పడం ప్రశాంత్ నీల్‌కే దక్కింది.

Salaar: From Prabhas To Shruti Hassan And Prithviraj, Here's How Much The Cast Of This Action

సినిమా మొదటి 45 నిమిషాలు ఎవరు ఊహించని విధంగా ఓ మిస్టరీ ఎలిమెంట్‌తో కొనసాగుతుంది. ఫ్రీ ఇంటర్వెల్ కు ముందు వరకు తుఫాన్ ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రభాస్ మోస్ట్ వైలెంట్గా యాక్షన్ తో ఇరగదీస్తాడు. ఇక ఇంటర్వెల్ కు ముందు పృథ్విరాజ్ సుకుమార‌న్ ఎంట్రీ తర్వాత సినిమా రేంజ్ మరో లెవల్ కు వెళుతుంది. ఎవరు ఊహించిన ట్విస్టుల‌తో థియేటర్లో ఉన్న ప్రేక్షకులకు సీట్లో కూర్చొని ఇవ్వదు.. 20 నిమిషాల పాటు దియేటర్ మొత్తం అదిరిపోతుంది. ప్రశాంత్ ఆ 20 నిమిషాల్లు పూన‌కాలు తెప్పించేలా ఎలివేషన్స్ పెట్టాడు. మనం ప్రభాస్ ను ఓ మాన్‌స్ట‌ర్‌లా తెరమీద చూస్తాం. సెకండాఫ్ కాస్త లెన్దీగా ఉన్నా కావాల్సిన‌న్ని ఎంగేజ్ చేసే యాక్షన్స్ సీన్లు ఉన్నాయి.

ఇక బాహుబలి సినిమాలో అనుష్క చేయి పట్టుకున్నాడని యువరాజు పీక‌నరికే స్టైల్లో ఈ సినిమాలోనూ పృథ్విరాజ్‌ను టచ్ చేసాడని ఒకటి తల నరికే సీన్ బాహుబలి సినిమాను గుర్తుకు తెస్తుంది. ఆ సీన్‌కు థియేటర్లో విజిల్స్ మాత్రం ఆగలేదు. ఇక మరోసారి ప్రశాంత్ నీల్ తన కోల్ మైనింగ్ కథలో ఇన్వాల్వ్ చేసిన ఈసారి కాన్సర్ అనే తెగల సామ్రాజ్యాన్ని అక్కడ కుర్చీ కోసం జరిగే అంతర యుద్ధాన్ని అందులో ఇద్దరు ప్రాణ స్నేహితుల కథను జోడించి సలార్ సినిమాగా చూపించిడు. తనకు ఇష్టమైన రీతిలోనే ఓ పెద్ద స్పాన్ ఉన్న కథను తీసుకొని పవర్ఫుల్ ఎలివేషన్లతో సలార్‌ను తీర్చిదిద్దాడు. ఇక్కడ నిజం చెప్పాలంటే సినిమాలో యాక్షన్ ఎలివేషన్ తో పోలిస్తే డైలాగులు తక్కువే ఉన్నాయి .. కానీ అవి చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. పెద్ద కథను ఓవర్ లేకుండా ఎంతలా ఎలివేషన్ ఇవ్వాలోఅంతే ఇచ్చి సలార్‌ను ప్రేక్షకుల‌ ముందుకు తీసుకువచ్చాడు. మరోసారి ఇండియన్ సినిమాపై డైరెక్టర్గా తనదైన స్పెషాలిటీ చూపించాడు.

Prabhas "Salaar: Part 1 – Ceasefire" Movie Runtime Revealed

ఇక సినిమా చివరిలో అసలు ప్రభాస్ ఎవరు..? ప్రభాస్ కాన్సార్‌లోని శౌర్య‌వ్ తెగకు చెందిన వాడే అన్న ట్విస్ట్ జగతిబాబు దగ్గర రివిల్ అవ్వటం ఈ సినిమాకి పెద్ద ట్విస్ట్.. అసలు ఈ సినిమాలో ఏం జరుగుతుందో ఎవరి ఊహలకు అంతు పట్టని విధంగా ఉంది. ఇక ప్రశాంత్ త‌న గత సినిమా కేజీఎఫ్ లో చాలా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా 2 మీద ఎంత ఇంట్రెస్ట్ రేపాడు సలార్‌లో చాలా ప్రశ్నలకు ఆన్సర్లు లేకుండా అంతే ఉత్కంఠ పుట్టించాడు. అసలు విలన్ ఎవరు అన్నది కూడా సస్పెన్స్ లో పెట్టాడు.

నటీనటుల పర్ఫామెన్స్:
ఈ సినిమాలో ఎంతోమంది పాత్రలో ఉన్న ఇది పూర్తిగా ప్రభాస్ వన్ మ్యాన్ షో. సినిమా పూర్తిగా ప్రభాస్ ఎలివేషన్ల మీద వెళ్తూ ఉంటుంది. ప్రభాస్ నుంచున్నా, కూర్చున్నా, ఫైట్ చేసినా, చివ‌ర‌కు డైలాగ్ చెప్పినా ఎలివేష‌న్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రభాస్ గ‌త రెండు సినిమాల్లో చూసిన ప్రేక్షకులు మాస్ జనాలకు కిక్క ఇవ్వలేదు ఈ సినిమాలో దేవాగా ప్రభాస్కుప్రభాస్ కథ రెండు సినిమాల్లో చూసిన ప్రేక్షకులు మాస్ జనాలకు కిక్క ఇవ్వలేదు ఈ సినిమాలో దేవాగా ప్రభాస్ప్రభాస్ కథ రెండు సినిమాల్లో చూసిన ప్రేక్షకులు మాస్ జనాలకు కిక్క్‌ ఇవ్వలేదు. ఈ సినిమాలో దేవాగా ప్రభాస్ తన అభిమానులకు మంచి కిక్కిచ్చే పాత్రలో ఇరగదీసాడు. ఈ సినిమాలో వచ్చిన‌ ఎలివేషన్లు ఎవరు ఊహించిని విధంగా ఉంటాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఇది అసలు అయన కం బ్యాక్ సినిమా. కొన్ని కొన్ని సన్నివేశాల్లో కథేంటో మనకు అర్థం కాకపోయినా ఎలివేషన్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది.

Salaar First Review | Prabhas Salaar First Review | Prabhas-Prithviraj Salaar Movie Review | Salaar Early Review - Filmibeat

ఇక సినిమాలో ప్రభాస్ తర్వాత మిగిలిన పాత్రల్లో పృథ్విరాజ్ సెకండాఫ్‌లో చాలా సేపు కనిపిస్తాడు.. ఇక మిగిలిన వారిలో టాలీవుడ్ నటుల్లో జగపతిబాబు ఖాన్సార్ కి రాజుగా నాలుగైదు సన్నివేశాల్లో కనిపించి మాయమవుతాడు. ఇక అదే విధంగా సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వి పాత్రలు కన్నా యాంకర్ ఝాన్సీ పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ ఎంతో బాగుంటుంది. అయితేఝాన్సీ పాత్ర నెగటివ్ రోల్ లో కనిపిస్తూ ఎంతో భయంకరంగా ఉంటుంది. అలాగే బ్రహ్మాజీ కూడా కాన్సార దొర‌ల్లో ఒక‌డిగా బొమ్మ‌లా క‌నిపిస్తాడు.. అయితే అతనికి సినిమా ఆఖరిలో ఒకే ఒక డైలాగ్ ఉంటుంది. ఇక‌ లేడీ విలన్ గా శ్రీయ రెడ్డి బాహుబలి లో శివగామి రేంజ్ లో కాకపోయినా అదే స్టైల్ లో పవర్ ఫుల్ గా కనిపించే పాత్రకు న్యాయం చేసింది. ఇక తెర నిండా చాలామంది పాత్రులు కనిపిస్తూనే ఉంటాయి.. కానీ కాన్సార్ సామ్రాజ్యంలో చాలామంది ఉంటారు చాలా మంది కేజిఎఫ్ న‌టులు కూడా ఉంటారు.

సాంకేతిక విభాగం :
టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాత విజయ్‌ కిర్‌గంధూర్‌ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. ఐతే, ఉత్కంఠభరితమైన కథనాన్ని ఇంకా ఎఫెక్టివ్ రాసుకుని ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.

ప్ల‌స్ పాయింట్స్ ( + ) :

బీజీఎం
-ప్ర‌శాంత్ నీల్ టేకింగ్‌
-మైండ్ బ్లోయింగ్‌, ఆకాశాన్నంటే ఎలివేష‌న్లు
-ప్ర‌భాస్ క్యారైక్ట‌రేజేష‌న్‌
-ఎమోష‌న్లు

మైన‌స్ పాయింట్స్ ( – ) :
-ర‌న్ టైం
-కొన్ని చోట్ల అర్థంకాని టిఫికల్ స్క్రీన్ ప్లే
-కొన్ని ఎలివేష‌న్లు కేజీయ‌ఫ్‌ను గుర్తు చేయ‌డం

Salaar USA Pre Bookings: ₹2.5 Cr And Counting!

ఫైనల్ గా:
హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సలార్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఎంతో ఇంట్రెస్ట్ గా సాగుతూ గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు మెయిన్ క‌థ‌లో యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఫుల్ కిక్కిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి.. కానీ ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చుతుంది.

చివరగా: ఇది.. బాహుబలి తర్వాత ప్రభాస్ చేయవలసిన అసలు సిసలైన సినిమా అంటే సలార్..

రేటింగ్: 3.5/5

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...