టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జ నటిస్తున్న తాజా మూవీ హనుమాన్. ఈ సినిమా ఈనెల 12న అనగా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమా రిలీజ్ కి ఒక్కరోజు ముందుగానే ఈ సినిమా యూనిట్ పేడ్ ప్రీమియర్ షోస్ తో దుమ్ము రేపుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకులు నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది.
హనుమాన్ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపానీష్ భాషల్లో రూపొందించారు. ఈ సినిమా కోసం రూ.50 కోట్ల వరకు ఖర్చుపెట్టగా.. మరో రూ.5 కోట్ల ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం కేటాయించారు. దాంతో ఈ సినిమా రూ.50 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.30 కోట్లగా నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా బడ్జెట్‌లో 50 శాతం రికవరీని సాధించినట్లయింది.
హనుమాన్ సినిమాను మన తెలుగు రాష్ట్రాల్లో 21.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్‌కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇక దాంతో హనుమాన్ సినిమా పూల్ బిజినెస్ రూ.27.5 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమాకు రూ.28.5 కోట్లు బ్రేక్ ఈవెన్‌గా మారింది.పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న హనుమాన్‌కు బాక్సాఫీస్ టార్గెట్ పెద్దగా కనిపించడం లేదు.
అయితే మరి ఈ సినిమా మహేష్ గుంటూరు కారాన్ని తలదన్ని ముందుకు వెళ్తుందో లేదో చూడాలి . మూవీకి పాజిటివ్ టాక్ వస్తే.. లాభాల్లోకి రావడం అంత కష్టం కాదు అనే మాట వినిపిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన వస్తున్నది. సంక్రాంతి రేసులో హిట్‌గా నిలిచే సినిమా కూడా ఇదే అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది.