ఫిదా మూవీ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చీ భానుమతిగా పక్కా తెలంగాణ యాసతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది సాయి పల్లవి. ఎప్పుడూ నవ్వుతూ ఎంతో అందంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన మొదటి ప్రేమలేఖ ఎప్పుడు రాసింది అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకు వచ్చింది. అదే విధంగా ఈ ముద్దుగుమ్మకు చిన్న వయసులోనే ఓ లవ్ స్టోరీ కూడా ఉందట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి వయసుతో సంబంధం లేదు అంటూ అంటారు. అలాగే ఈమె కూడా తన ఏడో తరగతి చదివే సమయంలోనే లవ్ లెటర్ రాసింది. మొదటి చివరి ప్రేమ లేక కూడా అదే అంటూ సాయి పల్లవి ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చింది.
నేను రాసుకున్న ప్రేమలేఖ నాకు ఇప్పటికీ గుర్తుంది అదే నా చివరి ప్రేమ లేక కూడా అంటూ వివరించింది. ఆమె మాట్లాడుతూ నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్లో ఓ అబ్బాయి నాకు ఎంతో నచ్చాడో.. ఆ విషయాన్ని అతనికి ఎలా చెప్పాలో తెలియక ప్రేమలేఖ రాశా కానీ అ లెటర్ అబ్బాయికి ఇచ్చే ధైర్యం నాకు లేదు ఇవ్వలేకపోయాను. అయితే ఆ లెటర్ నా దగ్గరే ఉండిపోవటంతో ఒకరోజు ఇంట్లో వాళ్ళు దాన్ని చూశారు.. నన్ను బాగా తిట్టారు కొట్టారు. దీంతో మళ్ళీ అలాంటి వాటి జోలికి వెళ్లలేదు. ఆరోజు తిట్లు దెబ్బలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది.
ఆ వయసులో అలాంటి లేక ఎలా రాయగలిగాను అని నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ అది తలుచుకుంటేనే ఇప్పటికి నవ్వొస్తుంది. మన జీవితంలో గుర్తుంచుకునే సంఘటనలు ఎన్నో ఉంటాయి.. అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. చూడటానికి ఎంతో సైలెంట్ గా కనిపించే సాయి పల్లవి ఇంత మూదర ఏడో తరగతిలోనే ప్రేమ నడిపిందా అంటూ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.