అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరోలుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్య మినిమమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినప్పటికీ స్టార్ హీరోగా మారటానికి తనపై నమ్మకంతో వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదే సమయంలో గతంలో సమంతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఆరేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట కేవలం సంవత్సరం కాలం కూడా కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు.అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి అసలు రీజన్ ఏమిటి.. అనేది ఇప్పటికీ కూడా ఎవరు నోరు విపటం లేదు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య అందులో ఓ హీరోయిన్ అంటే తనకు ఇష్టం అంటూ తన మాజీ భార్య సమంత పరువుని గంగలో కలిపేసాడు.
అక్కడ ఉన్న యాంకర్ మీకు ఏ హీరోయిన్ అంటే మీకు ఎక్కువ ఇష్టమని అడగగా నాకు కృతి శెట్టి అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మీతో చాలామంది హీరోయిన్లు నటించారు మీతో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన హీరోయిన్ ఎవరు అని యాంకర్ అడగగా మళ్లీ కృతి శెట్టి నే అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఏ కొచ్చిన్ అడిగినా నాకు కృతి శెట్టి ఇష్టం అంటూ సమంతతో ఉన్న బంధాన్ని మరియు చేసిన సినిమాలని గంగలో కలిపేశాడు నాగ చైతన్య. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలు చూసిన సమంత అభిమానులు చైతు పై విరుచుకుపడుతున్నారు.