ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న సరే పెళ్లి గురించి పట్టించుకోకుండా వరుస సినిమాలు కమిట్ అవుతున్నాడు. ప్రభాస్ తో సినిమాలు చేయడానికి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో దర్శకులు క్యూకడుతున్నారు. చిత్ర పరిశ్రమలోనే ఎలాంటి నెగటివ్ ట్రోలింగ్ లేకుండా ముందుకు వస్తున్న టాప్ హీరో కూడా ఇతనే. కాగా ప్రభాస్ ప్రస్తుతం కల్కి మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
అలాగే త్వరలోనే హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగలతో కూడా సినిమాలు మొదలుదలు పెట్టబోతున్నాడు, ఈ విషయం ఇలా ఉంచితే.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన సందీప్ రెడ్డివంగా తన తర్వాత సినిమా స్పిరిట్ ను ప్రభాస్‌తో చెబుతున్నాడు. అయితే సందీప్ రెడ్డి వంగ సినిమాలంటే యాక్షన్ తో పాటు రొమాన్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ తో చేసే స్పిరిట్ మూవీలో కూడా సందీప్ ఇప్పటి వరకు చేసిన తన సినిమాలకు మించి స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌ను చూపించబోతున్నారట.
అయితే ప్రభాస్ ఇప్పటివరకు తన నటించిన ఏ సినిమాలో కూడా అతిగా ఏ సినిమాలో కూడా తాను రొమాన్స్ చేయలేదు. అయితే ప్రభాస్ మాత్రం అలాంటి సీన్స్ ఏమన్నా ఉంటే ముందే చేయనని చెప్పేస్తాడట . అమ్మాయిలను అవమానించే అలాంటి సీన్స్ అసలు నా సినిమాలో వద్దనే వద్దు అంటూ తెగేసి మేకర్స్ కు క్లారిటీ గా చెప్పేస్తాడట. ప్రభాస్ కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ తన సినిమాల్లో కొన్ని సీన్స్ ఉండకూడదు అంటూ డైరెక్టర్ కి కండిషన్స్ పెడతాడట. తన సినిమాలో రేప్ సీన్స్ తను హద్దులు మీరీన రొమాంటిక్ సీన్స్ చేయను అంటూ డైరెక్టర్ కి ముందే చెప్పేస్తాడట.
కొన్ని కొన్ని సినిమాలలో కథ డిమాండ్ చేస్తే హీరోలు లిప్ లాక్స్.. బెడ్ సీన్స్.. న్యూడ్ సీన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభాస్ మాత్రం అలాంటి సీన్స్ ఏమన్నా ఉంటే ముందే చేయనని చెప్పేస్తాడట. అమ్మాయిలను అవమానించే అలాంటి సీన్స్ అసలు నా సినిమాలో వద్దు అంటూ తెగేసి మేకర్స్ కు క్లారిటీ గా చెప్పేస్తాడట. అయితే ప్రస్తుతం ప్రభాస్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మిడియాలో వైరల్ గా మారింది..!!