ఈ మధ్య మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ని ‘నాన్ లోకల్’ అంటూ కొంతమంది కామెంట్ చేయడం, అలాగే ఆయన వ్యక్తిత్వంపై కూడా కామెంట్ చేయడం ఒక వివాదాంశం అయింది. అందుకు సమాధానంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరికీ సమాధానాలు ఇచ్చాడు ప్రకాష్ రాజ్. తన ఉద్దేశాల పట్ల కూడా క్లారిటీతో ఉన్న విషయం ఖరారు చేసాడు. ఆయనకి మద్దతుగా నాగబాబు కూడా సమర్థిస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. చిరంజీవి సపోర్ట్ కూడా ప్రకాష్ రాజ్ కే ఉందని ఖరారు చేసాడు ఆయన.
ఐతే, ఆర్జీవికి చిరు ఫ్యామిలీతో.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో పేచీ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఆయన ఎన్నోసార్లు ఆయన మీద, వాళ్ళ కుటుంబం మీద కామెంట్లు కూడా చేసాడు. వివాదాలు క్రియేట్ అయ్యాయి. కొన్నిసార్లు పరోక్షంగా, మరికొన్ని సార్లు ప్రత్యక్షంగా కూడా పవన్ కళ్యాణ్ ఆర్జీవీని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఐనా, ఇప్పుడు మా ఎన్నికల నేపథ్యంలో చిరు ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చేస్తున్నారని తెలిసినా.. ఆర్జీవీ ఈ విషయాలనన్నిటినీ పక్కన పెట్టి ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చేస్తూ ట్విటర్ లో పోస్ట్స్ చేశారు.
ముఖ్యంగా ఆయన్ని నాన్-లోకల్ అని కొందరు ప్రస్తావించడం పట్ల ప్రధానంగా స్పందించాడు.
‘ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ ఐతే, మైకేల్ జాక్సన్ కూడా నాన్ లోకలే, ఆ మాటకొస్తే రాముడు సీత కూడా నాన్ లోకలే..’ అన్నారు. ఇంకా ప్రకాష్ రాజ్ తెలుగువాడిగా మారి 30 ఏళ్లు అయిందని, ఇక్కడే ఉంటూ.. భాష అనర్గళంగా మాట్లాడుతూ, తెలుగు రచయిత అయిన చలం పుస్తకాలని ముద్రించి, ఒక తెలుగు గ్రామాన్ని దత్తత తీసుకుని, ఇండస్ట్రీలో పాతికేళ్ళ పాటు ఉన్నవాడు నాన్-లోకల్ ఎలా అవుతాడని ఆయన అన్నారు.
ఇంకా, మన పెద్ద స్టార్స్ అయిన నందమూరి తారకరామారావ్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారని, మోహన్ బాబు కూడా తిరుపతి వదిలి చెన్నై వెళ్లారని, ఇలా అందరూ వేరొక భాషల్లో పనిచేస్తూ, అక్కడ అభిమానులని సంపాదించుకున్న వాళ్ళు లోకల్ ఎలా అవుతారని ప్రశ్నించాడు. అలాగే, మహారాష్ట్రలో పుట్టి తమిళ సినిమాకి కింగ్ గా మారిన రజనీకాంత్, ఉత్తరప్రదేశ్ లో పుట్టి బాలీవుడ్ ని ఏలిన అమితాబ్ బచ్చన్ లని కూడా లోకల్ కాదంటారా అని ఆలోచింపజేసే ప్రశ్నలు వేశాడు.
Leave a comment