కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంధర్భంలో గత సంవత్సర కాలంగా దేశంలో పలు చోట్ల నిరసనలు ఇంకా వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఐతే, రైతులు ఆ చట్టాల వల్ల తీవ్రంగా నష్టపోతారని.. ఎవరూ వ్యవసాయం చేసుకుని బ్రతకలేక చివరికి వ్యవసాయ కూలీలుగా మాత్రమే మిగిలిపోతారన్న వాదనతో ఈ సమస్యపై మాట్లాడటానికి ముందుకు వచ్చి అరెస్టయ్యారు ఆర్ నారాయణ మూర్తి.
నారాయణ మూర్తి గారు.. సగటు మనుషులు కష్ట నష్టాల గురించి సినిమాలు తీస్తూ, అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఉంటారని మనకు తెలుసు. ముఖ్యంగా ఆయన సినిమాలు వ్యవస్థలను ప్రశ్నిస్తూ ఉంటాయి. దోపిడీని వేలెత్తి చూపేవిగా ఉంటాయి. నిజ జీవిత సమస్యలనే కథలుగా తీసుకుని సినిమాలు చేస్తున్న ఆయనకి ఈ సమస్యపై కచ్చితంగా స్పందించాలని అనిపించినట్లు ఉంది. అందుకే ఆయన ముందుకు వచ్చారు.
‘ఛలో రాజ్ భవన్’ అంటూ అనుమతి లేని ఒక కార్యక్రమలో పాల్గొన్న నారాయణమూర్తి గారిని పోలీసులు అరెస్ట్ చేసారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేని కారణాన ఆయన్ని అదుపులోకి తీసుకోక తప్పలేదని పోలీసులు అంటున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే పేదరికం మరింత పెరిగిపోతుందని గుర్తు చేసారు ఆర్ నారాయణమూర్తి.
Leave a comment