ప్రకాష్ రాజ్ కి కొన్ని ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా రెండు పాయింట్లని ఆయన లేవనెట్టారు. ఒకటి, అసలు ఎలక్షన్స్ గురించి మాట్లాడింది ఎవరు? అసలు ఎలక్షన్స్ ఉన్నాయని ఎవరు అనౌన్స్ చేసారు? అధికారికంగా ఈ సంధర్భంలో ఎన్నికలు ఉంటాయని ఎవరైనా చెప్పారా? అసలు ఎవరు అనౌన్స్ చేశారని ఆయన మీటింగ్ పెట్టారు?
రెండోది.. ప్యానల్. ఇప్పటికే ఒక ప్యానల్ అధికారంలో ఉండగా, ఆ ప్యానల్ లో ఉన్నవాళ్ళు వేరొక ప్యానల్ లోకి అప్పుడే ఎలా వచ్చారు? ప్రెసిడెంట్ తో వాళ్ళు పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? ఆ ప్యానల్ కి రిజైన్ చేయకుండానే ఈ ప్యానల్ కి ఎలా వస్తారు?
ఇంకా చెప్పాలంటే.. ఇది కేవలం 900 మందికి సంబంధించిన విషయం. దీనిని ఇంత పెద్దది ఎందుకు చేస్తున్నారు? మీడియా సమావేశం పెట్టాల్సిన అవసరం ఏముంది? మీకు ‘మా’ తో సమస్యలు ఉంటే అంతర్గతంగా మీటింగ్ పెట్టుకుని ఎందుకు మాట్లాడలేదు? దీన్ని మీడియా ముందుకు తీసుకురావాల్సిన అవసరం లేదని అన్నారు.
ప్రకాష్ రాజ్ కి సూటిగా ఈ ప్రశ్నలు వేయడమే కాకుండా.. నాగబాబుని కూడా ప్రశ్నించారు. అసలు చిరంజీవి నిజంగా మద్దతు ఇచ్చారో లేదో తెలీదు.. కానీ నాగబాబు అలా ఎలా మాట్లాడతారు.. ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడటం అదంతా అనవసరం అన్నారు. తెలంగాణా వాదాన్ని తీసుకొచ్చిన సీవీఎల్ నరసింహారావ్ గారి మీద కూడా ఆయన మండిపడ్డారు.
Leave a comment