ఎ.ఎం. రత్నం నిర్మాతగా, మోహన్ గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి తన సత్తా ఏంటో చూపించింది. ఆమె కెరీర్ లోనే ఉత్తమంగా నటించిన సినిమాలలో ఇదీ ఒకటి. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా.. డబ్బు మదంతో, అధికార మదంతో విర్రవీగే వాళ్ళ ఆట ఎలా కట్టించింది అనేది ఈ సినిమా కథాంశం. ఒక లేడీగా, అహంకారం పూరితంగా వ్యవహరించే మగవాళ్ళని ఎలా ఎదుర్కోవాలో ఒక ఉదాహరణగా ఈ మూవీ ఆడవాళ్ళకి మంచి స్పూర్తిని ఇస్తుంది.
1990 లో విడుదలైన సినిమాకి రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. అదే సంవత్సరం.. ఈ సినిమాలో విజయశాంతి చేసిన నటనకి గాను ఆమెకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ వచ్చింది అంటే ఈ సినిమా స్థాయిని అర్థం చేసుకోవచ్చు.. అలాగే నటిగా రాష్ట్ర స్థాయిలో ఒక నంది అవార్డు, ఒక ఫిల్మ్ ఫేర్ – తెలుగు అవార్డ్ కూడా అందుకుంది విజయశాంతి. మొత్తంగా ఆ సంవత్సరం ఉత్తమ చిత్రంగా కూడా కర్తవ్యం సినిమా ఎన్నికైంది.
సాయి కుమార్, పరుచూరి వేంకటేశ్వర రావ్, వినోద్ కుమార్, మీనా, నిర్మలమ్మ, చరణ్ రాజ్, నూతన ప్రసాద్, బాబు మోహన్ వంటి వాళ్ళు కలిసి నటించిన ఈ సినిమాకి రాజ్-కోటి మ్యూజిక్ అందించారు. కథ రాసింది పరుచూరి బ్రదర్స్. ప్రసాద్ బాబు సినిమాటోగ్రఫీ చేసిన ఈ సినిమాకి నేటితో 31 ఏళ్లు నిండాయి. 90 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకి ఆ రోజుల్లో 7 కోట్ల వసూళ్లు దక్కాయి. తమిళంలోకి వైజయంతి ఐపిఎస్ గా డబ్ అయిన సినిమా, హిందీలో ‘తేజస్విని’ గా రీమేక్ గా కూడా వెళ్ళింది. ఆ సినిమాలోనూ విజయశాంతినే కనిపించడం విశేషం.
Leave a comment