రష్మిక మందాన కన్నడ బ్యూటీ.. తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుపోతుంది. లక్కీగా ఆమెకి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. అది కూడా పెద్ద హీరోలతో. ఇప్పటిదాకా చేసిన సినిమాలు కూడా ఫెయిల్ అవలేదు. అన్నీ సక్సెస్ అవుతూనే వచ్చాయి. ఇక తనని తాను ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.
మెల్లగా తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట. తనకి ఉన్న డిమాండ్ కూడా అలాంటిది కావడంతో నిర్మాతలు ఇవ్వడానికి పెద్దగా ఆలోచించటం లేదట. ఐతే, రష్మిక ఒక పై స్థాయి సెలబ్రిటీకి మారిపోవడానికి అభిమానులకి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ మధ్య తన సోషల్ మీడియా పేజెస్ లో బాగా ఆక్టివ్ గా ఉంటుంది రష్మిక. తన ఫాన్స్ చేసే కామెంట్స్ కి సమాధానాలు కూడా ఇస్తుంది. ఈ మధ్య ఒక అభిమాని.. మీరు పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయికి ఎలాంటి లక్షణాలు అడిగాడు. అతను కచ్చితంగా చాలా సింపుల్ గా ఉండేవాడు అయి ఉండాలి.. ఒక నార్మల్ పర్సన్ లా కనిపించే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.
అలాగే కొన్ని అలవాట్లపై కూడా రెస్పాన్స్ ఇచ్చింది రష్మిక. తనకి స్మోక్ చేసేవాళ్ళంటే అస్సలు నచ్చరట. వాళ్ళకు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తానని చెప్తుంది.
Leave a comment