ఫలక్ నుమా దాస్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన విశ్వక్ సేన్ తన జోరుని కొనసాగిస్తున్నాడు. తన తోటి స్టార్స్ తో పోటీ పడే ప్రయత్నం చేస్తున్నాడు. మరోపక్క రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన జోరుని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటిదాకా పెద్ద పెద్ద స్టార్స్ తో జంటగా నటించి తనకంటూ పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా తనంతట తాను వెబ్ సిరీస్ లు చేయడానికి సిద్ధమైంది. ఇందుకోసం తను ఓటీటీలోకి రాబోతుంది కూడా.
ఆమె చేయబోతున్న సినిమాకి సంబంధించిన కొన్ని వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ వెబ్ సిరీస్ టైటిల్ ”అక్టోబర్ 31 st నైట్”. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి షూటింగ్ పనులు కూడా మొదలయ్యాయి. ఓటీటీలో రిలీజ్ చేయడం కోసమే ఈ సిరీస్ ని చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. ఈ సిరీస్ లో విశ్వక్ సేన్ పెళ్లి కొడుకులా కనిపించబోతున్నాడట. ఐతే, అతను రకుల్ ప్రీత్ కి జంటగా కనిపిస్తాడా లేదా ఆ పాత్ర స్వభావం మరోలా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సిరీస్ లో వాళ్ళిద్దరితో పాటు.. నివేద పేతురాజ్, మేఘా ఆకాశ, విద్యు రామన్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇంకా ఈ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది.
Leave a comment