ఆమె పుట్టింది ఇండియాలో కాదు. కానీ, తమిళ తెలుగు భాషాలలో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్నారు. ఆమె సినీ జీవితంలో ఎన్నో విజయాలు. తమిళ నాడు ప్రభుత్వం నుంచి, ఉత్తమ నటీ నటులకి గౌరవంగా ఇచ్చే ‘కళైమామిణి’ అవార్డు ఆమె దక్కించుకున్నారు. ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమలోనూ అలాంటి సత్కారాలు సొంతం చేసుకున్న సుజాత గారి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి.
అదే.. ఆమె తెరవెనక జీవితం. శ్రీలంకలో ఆమె తండ్రి ఉద్యోగం చేయడం వల్ల ఆమె కూడా అక్కడే పుట్టి పెరిగారు. తర్వాత చాలా కాలానికి చెన్నైకి మారిన వాళ్ళ కుటుంబం.. ఒక ఇంట్లో అద్దెకు ఉండేది. ఆ ఇంటి ఓనర్ కొడుకు.. జయకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మొదట్లో అతన్ని ఇష్టపడే పెళ్లి చేసుకున్న ఆమె.. కొన్నేళ్ళ తర్వాత ఆయన నుండి చాలా నరకం అనుభవించిందట. ఆయన రోజూ ఆమెని శారీరకంగా హింసించేవాడట. కొట్టేవాడట. ఆమె షూటింగ్ చేసుకుంటున్న ప్రదేశాలకి కూడా వచ్చి ఆమెని అల్లరి చేసే వాడట. వ్యక్తిగతంగా ఆయన మరే పనీ చేసేవాడు కూడా కాదట. పూర్తిగా ఈమె సంపాదిస్తున్న డబ్బుతో ఆధారపడి ఉన్న అతనికి.. ఈమెని సాధించడం తప్ప మరో పనేమీ లేకపోయింది.
సినిమాలలో ఆమె చేసే పాత్రలు కూడా అలా ఎంతో బాధని అనుభవించేవి అయి ఉంటాయి. ఆ పాత్రలన్నీ ఆమె చాలా చక్కగా చేస్తుంది. వాటిల్లో చక్కగా వదిగిపోతుంది. ప్రేక్షకులని అంతలా తన నటనతో మెప్పించడానికి వెనక ఇలాంటి కారణాలు ఉన్నాయి కాబట్టే ఆమె సినిమాల్లో అంత బాగా నటించేది అనే అభిప్రాయం ఉంది.
ఆమెకి ఇద్దరు పిల్లలు.. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇంట్లో అలాంటి బాధలు భరిస్తున్నా కూడా ఆమె సినిమాలు ఆపేసే ప్రయత్నం చేయలేదు. వెంటవెంటనే సినిమాలు చేసింది. దాదాపు 300 సినిమాల్లో నటించేసింది. ఒక సంధర్భంలో కొన్ని కారణాల వల్ల అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్న ఆమెకి అక్కడి వాతావరణం పడక మళ్ళీ ఇండియాకి రావాల్సిన పరిస్తితి వచ్చిందట. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో నటిస్తూ.. కాలం గడిపేశారట. చివరగా ఆమె నటించిన సినిమా.. శ్రీ రామదాసు సినిమాలో.. శబరి పాత్ర. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ గడిపేసిన సుజాత గారు 2011 లో చనిపోయారు.
Leave a comment