కరోనా కారణంగా చాలా వరకు సినీ అభిమానులు ఓటీటీలవైపు చూస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వాటి పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. సెకండ్ వేవ్ తర్వాత తిరిగి థియేటర్లని మొదలుపెట్టే పరిస్థితులు ఉన్నా జనాలు ఎక్కువగా పెద్ద సినిమాలని మాత్రమే ఆదరిస్తారనే అభిప్రాయం ఉంది. ఐతే చిన్న సినిమాల పరిస్తితి ఏమిటి? వాటిని ఎవరు ఆదుకోవాలి అన్న ప్రశ్న మొదలవుతుంది.
అందుకే ఈ సమస్యని దృష్టిలో పెట్టుకుని.. చిన్న సినిమాలు తీసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే ఆలోచనలో ఉంది కేరళ ప్రభుత్వం. అందుకోసం స్వయంగా తామే ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కల్చర్ ఎఫైర్ మినిస్టర్ అయిన సాజి చెరియన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ అవసరం చాలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పూర్తిగా థియేటర్లలో రిలీజ్ అయ్యేవి కేవలం పెద్ద సినిమాలు మాత్రమే. ఇక చిన్న సినిమాల పరిస్తితి అంతే. ఒకవేళ వాటికి అవకాశం ఇచ్చినా.. ఒక్క పెద్ద సినిమాతో అవి మరుగున పడతాయి. ఇక్కడ కూడా కేరళ ప్రభుత్వం మాదిరి ప్రభుత్వమే ఒక ప్రత్యేకమైన ఓటీటీ ప్లాట్ ఫామ్ రెడీ చేయాలని కోరుకుందాం.
Leave a comment