రామ్ & లక్ష్మణ్. వీళ్ళిద్దరూ తెలుగు సినీ అభిమానులకి బాగా తెలిసిన వ్యక్తులు. ఫైట్ మాస్టర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళు కలిసి పనిచేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. చాలా మంది దర్శకులు ఫైట్ సీన్స్ వీళ్ళతో చేయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ, ఒక్క దర్శకుడితో మాత్రం వీళ్ళకు చాలా ఇబ్బంది ఉన్నట్టు చెప్పుకొచ్చారు ఈ ఇద్దరు అన్నదమ్ములు. ఇందుకు కారణం కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.
రాజమౌళి గారికి తను చేస్తున్న సినిమాలో.. మిగిలిన అన్ని విషయాలపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారని వింటూ ఉంటాం. అంటే ఆయన ఒక సినిమా చేస్తున్నప్పుడు.. ఆ మూవీలో కేవలం దర్శకత్వం మీద మాత్రమే కాకుండా.. ఇంకా అందులో నటుల మేకప్, వాళ్ళ డ్రెస్సింగ్, డైలాగ్స్, డాన్స్, ఫైట్స్ అన్నిటి మీదా శ్రద్ధ తీసుకుంటూ సినిమా వీలైనంత బాగా తీసే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలోనే రామ్, లక్ష్మణ్ వంటి వాళ్ళకి కూడా ఆయన పెద్దగా అవకాశం ఇవ్వకుండా.. ఫైట్ సీన్స్ ని దగ్గరుండి చేయిస్తుంటారని వాళ్ళు చెప్పారు. ఇలా చేయడం వల్ల ఆ సినిమాకి దూరం కావాల్సి వచ్చిందని చెప్పారు.
Leave a comment