తమిళ్ లో అసురన్ పేరుతో ధనుష్ నటించిన సినిమా అక్కడ పెద్ద హిట్ ఐన సంగతి తెలిసిందే. ఈ మూవీ ధనుష్ పర్ఫార్మెన్స్ కి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చిన విషయం కూడా మనకి తెలుసు. మంజు వారియర్, ప్రకాష్ రాజ్ లు కూడా అధ్బుతంగా నటించిన ఆ మూవీ మంచి మార్కులు కొట్టేసింది.
ఐతే, ఈ మూవీని తెలుగులోకి రీమేక్ చేయాలి అనే ఆలోచన వెంకటేష్ కి వచ్చినట్టు తెలుస్తోంది. తన కుటుంబాన్ని కాపాడుకునే వాడిగా, తమపై జరిగే వివక్షను ఎలా ఎదుర్కొంటాడు అనేది ప్రధాన కథాంశం. తెలుగులో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ముందుగా థియేటర్ రిలీజ్ అనుకున్నా.. కరోనా పరిస్తితులు చివరగా మూవీని అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల చేసెట్టుగా చేశాయి. ఈ నెల 20 వ తేదీన subscribers కి అందుబాటులో ఉంటుంది.
కథ నేపథ్యం కుల వ్యవస్థని ప్రశ్నించడం, దాని తాలూకు పోరాటం వంటి వన్నీ చూపించే ప్రయత్నంలో తెలుగీకరణలో కథలో మార్పులు చోటు చేసుకోవచ్చు అన్న అనుమానం వీడింది. కథలో ఎలాంటి మార్పులు చేయనట్టు అర్థమవుతోంది. ఐతే, చాలా భిన్నంగా ఇలాంటి పాత్రని పోషించిన విక్టరీ వెంకటేష్ గారిని తెలుగు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. అలాగే, చాలా ఏళ్లుగా సినిమాలు లేక ఒక హిట్ కోసం ప్రయత్నిస్తూ వచ్చిన శ్రీకాంత్ అడ్డాల కూడా ఈ మూవీతో బ్రేక్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.
Leave a comment