రాధిక. తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న నటి. మెగాస్టార్ చిరంజీవితో ఆమె ఎన్నో సినిమాలు చేశారు. ఆ స్టార్ డంతోనే ఇండస్ట్రీలో చాలా ఏళ్లు నిలదొక్కుకోగలిగారు. అలాగే తమిళ్ లోనూ ఎన్నో సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులని కూడా ఎంతగానో ఆకట్టుకోగలిగారు. 70, 80 లలో ఆమె నటించిన సినిమాలు చాలావరకు విజయవంతం అయినవే. కానీ, ఆమె జీవితం ఎప్పుడూ అలా కొనసాగుతూ వెళ్లలేదు.
సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గడం, ఆమె చేసుకున్న మొదటి పెళ్లి విడాకులకి దారితీయడం ఆమెని డిప్రెషన్ లోకి నెట్టేసాయి. తర్వాత ఒక బ్రిటీష్ వ్యక్తిని పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోయిన ఆమెకి చాలాకాలం వరకు లైఫ్ ఈజీగానే గడిచిందని చెప్పాలి. కానీ.. తర్వాత ఆ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. రాధిక ఆ తర్వాత తిరిగి చెన్నై చేరుకుంది. కానీ.. ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. తన రెండో భర్తతో అప్పటికే ఒక పాప ఉండటం.. ఆమెకి లైఫ్ ని మరింత భారంగా మార్చేసింది. విపరీతమైన ఆర్థిక ఒత్తిడుల మధ్య అప్పులు కూడా చేయక తప్పలేదు. తనకి తెలిసిన చాలామందితో అప్పులు తీసుకోవడం మొదలెట్టింది. వాళ్ళంతా ఎలా తిరిగి చెల్లించని టైమ్ బ్యాంక్ లో చెక్ లు బౌన్స్ అయిన వివాదాల్లో కూడా ఆమె చిక్కుకుంది.
తర్వాత మెల్లగా కుదురుకున్నారు రాధిక. రాడార్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ సంస్థ చేసేపని సీరియల్స్ నిర్మించడం. వాటిల్లో స్వయంగా తను కూడా నటిస్తూ వచ్చింది. ఐతే, ఇదే టైమ్ లో తన భార్యని కోల్పోయి ఒంటరిగా ఉన్న శరత్ కుమార్.. ఆమెకి అండగా నిలిచారు. ఆమె ఆర్థిక సమస్యలని తన సమస్యలుగా భావించి ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఇలా రాధికకి మొత్తం మూడు పెళ్ళిళ్ళు జరిగాయి. చివరికి శరత్ కుమార్ తో మాత్రం ఆమె సంతోషంగా కలిసి ఉంటోంది. స్వయంగా శరత్ కుమార్ కూడా నటుడు కావడంతో ఆయనకి వస్తున్న ఆదాయంతో వీళ్ళు ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా బ్రతికేస్తున్నారు. అంత స్టార్ డం చూసిన రాధిక లాంటి హీరోయిన్ ఒక టైమ్ లో ఇలాంటి సమస్యలు అనుభవించారు అంటే నమ్మడం కాస్త కష్టమే.
Leave a comment