శిల్పా శెట్టి వంటి అందగత్తెని పెళ్లి చేసుకోవడం, రాజస్థాన్ రాయల్స్ వంటి ఒకానొక పెద్ద ఐపిఎల్ టీం ని నడపడం ఈ వ్యక్తిని బాగా ఫేమస్ అయ్యేలా చేసాయని చెప్పాలి. శిల్పా శెట్టి ఇతన్ని పెళ్లి చేసుకున్నది కేవలం ఇతని వ్యాపార సామ్రాజ్యం చూసి మాత్రమే అన్నది ఒక వాదన. ఐతే, రాజ్ కుంద్రా ఒకప్పుడు మధ్య తరగతి జీవితం గడిపాడట. ఐతే మధ్యలో వచ్చిన ఐశ్వర్యమేమో దానికి బాగా అడిక్ట్ ఐపోయాడు. ఐతే.. అతను చేస్తున్న వ్యాపారాల గురించి మాత్రం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.
పోర్న్ ఫిల్మ్స్ చేసి వాటిని ఒక ఆప్ లో అప్లోడ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడని ఆధారాలతో సహా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఈ వార్త ఒక్కసారిగా బీ టౌన్ లో పెద్ద న్యూస్ అయిపోయింది. ఊహించే విధంగానే ఇప్పటివరకు శిల్పాశెట్టి మీడియాముందుకు గానీ, తన సోషల్ మీడియాలో ఏదైనా రాయడం గానీ చేయలేదు. పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఐతే ఇక్కడే గమనించాల్సిన ఒక ఆశక్తికరమైన విషయం ఒకటుంది.
దాదాపు పదేళ్ళ క్రితం కూడా.. రాజ్ కుంద్రా.. ఈ విషయానికి సంబంధించి ఒక ప్రశ్నని లేవనెత్తాడు. పోర్న్ ని కొని చూడటం లీగల్ అయినపుడు.. వ్యభిచారం ఎందుకు లీగల్ కాదు. అసలు రెండిటికీ తేడా ఏంటి.. అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న అప్పట్లో లైమ్ లైట్ లోకి రాలేదు. ఏదో సాధారణంగా అడిగాడులే అనుకున్నారు. కానీ, పదేళ్ళ తర్వాత రెడ్ హ్యాండెడ్ గా అటు చట్టానికీ, ఇటు మీడియాకి దొరికిపోయి.. ఈ ట్వీట్ కూడా బయటికి వస్తుందని ఊహించి ఉండడు.
ఐతే, రాజ్ కుంద్రా మీద ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఐపిఎల్ లో ఇప్పటిదాకా అతని ఫ్రాంచైజ్ మీద మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన నేపథ్యంలో ఆ టీం ని బ్యాన్ చేయడం జరిగింది. అలాగే, పూనమ్ పాండే కూడా ఈ మధ్య రాజ్ కుంద్రా మీద ఒక కంప్లయింట్ చేసింది. గతంలో వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ లో పని చేసినపుడు.. ఆ కాంట్రాక్ట్ గడువు ముగిసిపోయినప్పటికీ.. ఇంకా తనకి సంబంధించిన కంటెంట్ ని అలా వాడుతూనే ఉన్నాడని చెప్పింది. ఇలాంటి కారణాలన్నీటితో రాజ్ కుంద్రా చెడ్డపేరు బాగా మూటకట్టుకున్నాడని చెప్పాలి.
Leave a comment