పా రంజిత్ భావజాల నేపథ్యంలో సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. ఇందుకోసం రజనీకాంత్ వంటి మేటి స్టార్స్ ని కూడా ఒప్పించి ఆయనతో కబాలి, కాలా వంటి సినిమాలను తీశాడు. వాటిని ఎంతో సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే, మాకు అంతగా నచ్చలేదు అన్నవాళ్లు కూడా ఉన్నారు. కానీ పా రంజిత్ తను చెప్పాలి అనుకున్నది చెప్పేశాడు. రియాలిటీని తెరమీద చూపించడానికి ఇష్టపడే ఈ సారి కాస్త భిన్నంగా ఉన్న కథతో ముందుకు వచ్చాడు. అది బ్రిటీష్ కాలంలో వాళ్ళు నేర్పి పోయిన ఒక విద్య నేపథ్యంలో జరిగే ఆధిపత్య పోరుగా చూపించాలి అనుకున్నాడు.
కథ విషయానికి వస్తే.. బ్రిటీష్ వాళ్ళు ఇండియాని పాలిస్తున్నాడు సరదాగా కొంతమంది భారతీయులకి బాక్సింగ్ ని నేర్పిస్తారు. అలా నేర్చుకున్న కొందరు ఈ ఆటని మారికొందరికి నేర్పుతూ ఉంటారు. అలా వాళ్ళలోనే వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయి బాక్సింగ్ గేమ్ ని ఆడుతూ ఉంటారు. అలా ఇడియప్ప, సార్పట్ట అనే రెండు వర్గాలు ఏర్పాటు అవుతాయి. అయితే, కూలీ వాడిగా పనిచేసే సమరన్ (హీరో ఆర్య), ఈ ఆట మీద ఇష్టాన్ని పెంచుకుంటాడు. బడికి వెళ్ళకుండా మరీ ఈ పోటీలు చూడటానికి వెళ్తూ ఉంటాడు. ఇలా ఒకసారి సార్పట్ట వర్గం పోటీలలో ఓడిపోతుంది. ఇక అవతలి వర్గంతో పోటీ పడటానికి ఎవరూ లేరన్న సంధర్భంలో సమరన్ పోటీకి దిగి గెలుస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.
ఇక ఇక్కడినుంచి ప్రధాన కథ మొదలౌతుంది. కానీ, సమరన్ తల్లికి ఈ పోటీల్లో పాల్గొనడం ఇష్టం ఉండదు. ఇలాంటి పరిస్తితుల్లో సమరన్ ఎలా తాను అనుకున్నది సాధించాడు అనేది ప్రధాన కథాంశం. బ్రిటీష్ కాలం నాటి సామాజిక పరిస్తితులని బాగా చూపించాడు పా రంజిత్. యాధావిధిగా తన మార్కు సామాజిక సమస్యలని స్పృశించే ప్రయత్నం చేశాడు. కథ మొత్తానికి 70 వ దశకంలో నాడుస్తున్నట్లు ఉంటుంది. నటీ నటుల నటన అధ్బుతం. ఈ పాత్ర బాగా చేయడం ఆర్య ఎంత కష్టపడ్డాడో తెరమీద కనిపిస్తుంది. అలాగే మిగతావాళ్ళు కూడా ఎవ్వరూ తక్కువ అనిపించుకోలేదు. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అనుకుంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడవచ్చు. ఈ పీరియాడికల్ డ్రామా మంచి కిక్ ని ఇస్తుంది.
Filmy Looks Rating : 3.75
Leave a comment