కె రాఘవేంద్ర రావ్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే దర్శకుల పేర్లలో ఇదీ ఒకటి. ఆయన ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ చాలావరకు కమర్షియల్ గా పెద్ద హిట్ సాధించినవే. అందులో ఎన్నో భక్తి స్పోరక కథలున్నా వాటిని కూడా కమర్షియల్ గా చూపించే ప్రయత్నం చేశారు రాఘవేంద్ర రావు. గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన దాదాపు అందరు పెద్ద హీరోలతో సినిమాలు చేశారు.
ఆయనతో సినిమా చేయాలని అందరు హీరోలు కోరుకుంటూ ఉంటారు. ప్రేక్షకుడికి వినోదాన్ని ఎలా పంచాలో బాగా అధ్యయనం చేసిన రాఘవేంద్ర రావ్ గారితో సినిమా చేసే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఐతే, అలాంటి దర్శకుడినే ఒక యంగ్ హీరో చాలా తేలిగ్గా తీసిపారేసేరట. ఆయన ఆఫర్ చేసిన ఆ కథని చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించలేదట. ఇంతకీ ఆ హీరో ఎవరో, ఆయన రిజెక్ట్ చేసిన స్టోరీ సంగతేంటో చూద్దాం.
ఆ హీరోనే మాస్ మహారాజా రవితేజ. ఇప్పటిదాకా ఒక హీరోగా అతను కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు టాలీవుడ్ లో. కానీ, రవితేజ కథల్ని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఒక కథకి ఓకే చెప్పడానికి చాలా ఆలోచిస్తాడని ఆయన గురించి వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు. ఇలా కొన్నిసార్లు సరిగ్గా గెస్ చేయలేని ప్రయత్నంలో కొన్ని పెద్ద సినిమాలని మిస్ అయిపోయాడు అన్న అభిప్రాయం కూడా ఉంది. ఐతే, ఇంతకీ రాఘవేంద్ర రావ్ గారి రవితేజకి చెప్పిన ఆ కథ ఏమిటో.. ఆ కథని మాస్ మహారాజా ఎందుకు వద్దన్నాడో ఒకసారి చూద్దాం.
రాఘవేంద్ర రావు గారు పౌరాణిక కథలని ఎంచుకోవడం అంత యాదృచ్ఛికం ఏమీ కాదు. ఇప్పటిదాకా ఆ జానర్ లో సినిమాలు చేసి వాటిని మంచి సక్సెస్ చేసిన అనుభవం కూడా ఆయనకి ఉంది. అందుకే ఒక ప్రయత్నంగా తను అనుకున్న కథతో రవితేజని ఒప్పించే ప్రయత్నం చేశారట. ఆ కథ కూడా మరేదో కాదు. బాలకృష్ణ నటించిన పాండురంగడు సినిమా. ఒకసారి అమెరికాలో ఏదో సమావేశంలో రవితేజని కలిసినపుడు.. ఈ మూవీ నీతో చేయాలని ఉంది అని చెప్పినప్పుడు చాలా సున్నితంగా తిరస్కరించాడట రవితేజ. అందుకు కారణం కూడా చెప్పాడు.. ‘సర్ ఇలాంటి పాత్రలు చేయాలి అంటే అందుకు నా మొఖం కూడా సరిపోవాలి కదా.. నేను మీరు చెప్పిన కథకి ఏమైనా సూట్ అవుతానా ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి ..’ అన్నాడట.
అంతే. రాఘవేంద్రరావ్ మళ్ళీ రవితేజని ఈ విషయం గురించి అడగలేదట. ఆ తర్వాత తను అనుకున్న కథకి ఎవరు సరిపోతారా అని ఆలోచించుకుని వెంటనే బాలకృష్ణ గారిని కలిసి ఈ కథ గురించి చెప్పగానే ఆయన కథని ఒప్పుకోవటం, హీరోయిన గా టబుని ఎంచుకుని మంచి రొమాంటిక్ సెన్స్ లో సినిమా చేయడం జరిగిపోయాయి. కానీ, థియేటర్ లో ఈ మూవీ సాధారణంగానే ఆడటం గమనార్హం. రవితేజ చేసి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోవడం కాస్త కష్టమే
Leave a comment