శ్రీహరి చనిపోయి ఇప్పటికి చాలాకాలమే అయింది. ఒకప్పుడు విలన్ గా తన సినిమా జీవితం మొదలుపెట్టి, తర్వాత విలన్ గా, కామెడీ విలన్ గా, హీరోగా కూడా సినిమాలు చేశారు. కానీ, చాలామందిలా శ్రీహరికి ఎలాంటి సినీ నేపథ్యం కూడా లేదు. కేవలం సినీ తెర మీద మాత్రమే కాకుండా.. ఒక బాడీ బిల్డర్ గా కూడా రాణించిన శ్రీహరి ఏం వీటిల్లోకి రాకముందు ఏం చేసేవారో చూద్దాం.
ఆయనది చాలా పేద కుటుంబం. ఆదాయం కోసం ఒక చిన్న మెకానిక్ షాప్ ని చూసుకునే వారట. ఐతే, ఈ పనిలో ఆయనకి ఎలాంటి ఆసక్తి లేదు. ఆయన ఆసక్తి అంతా సినిమాల మీదే. ఆ ఆసక్తి కూడా తన మెకానిక్ షాప్ దగ్గరలో ఒక థియేటర్ ఉండటం వల్ల, ఆ థియేటర్ కి తరచూ మూవీస్ చూడటం కోసం వెళ్ళటం వల్ల ఆయనకి సినిమా మీద ఎంతో ఇష్టం ఏర్పడింది. స్వయంగా తనకి నటన మీద ఉన్న ఆసక్తి అర్థమై, మూవీస్ లో ఎలాగైనా పనిచేయాలి అనుకున్నారు. ఇలా ఆయన జర్నీ 1988 లో మొదలైంది.
మొదట్లో ఒక విలన్ గా ప్రేక్షకులకి కనిపించినప్పటికీ.. చాలా తక్కువ కాలంలోనే ఒక హీరోగా కూడా అందరినీ కన్విన్స్ చేయడానికి ఆయనకి పెద్దగా టైమ్ పట్టలేదు. భద్రాచలం మూవీ శ్రీహరి గారికి హీరోగా మంచి గుర్తింపు తెచ్చిందని చెప్పాలి. ఇందుకు మరో ముఖ్య కారణం ఆయన ఆహార్యం కూడా. శ్రీహరి బాడీ బిల్డర్ గా కూడా చాలాసార్లు అవార్డ్ లు గెలుచుకున్నారు. ఇంకా అయోధ్య రామయ్య, గణపతి వంటి సినిమాలల్లోనూ ఆయన హీరోగా కనిపించారు. ఇంకా ఎన్నో పెద్ద సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా కూడా పనిచేశారు.
ముఖ్యంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో ఆయన చేసిన నటనకి నంది అవార్డ్ కూడా అందుకున్నారంటే శ్రీహరి నటనని ఎంతలా ఇష్టపడేవారో అర్థం చేసుకోవచ్చు. మేజర్ చంద్రకాంత్, ముఠామేస్త్రీ, బృందావనం, కింగ్, అల్లరి ప్రియుడు, హలో బ్రదర్ వంటి ఎన్నో సినిమాల్లో పాత్రలు పోషిస్తూ దశబ్దాల పాటు ఇండస్ట్రీలో ఉన్న శ్రీహరి మెకానిక్ షాప్ దగ్గర మొదలైంది అంటే ఆయన జీవితం ఎంతో స్పూర్తిదాయకమైనదనే చెప్పాలి.
Leave a comment