యండమూరి వీరేంద్రనాథ్ ఒక పాపులర్ రచయత అని అందరికీ తెలుసు కానీ కొన్నిసార్లు.. కాదు చాలాసార్లే ఆయన తన వ్యక్తిత్వ వికాస పాఠాలని కాంట్రాడిక్ట్ చేస్తూ ఉంటారు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నమాట. ఆయన మానసిక శాస్త్రానికి సంబంధించిన ఎన్నో పాఠాలను చెప్తూ.. ఆయన నిజజీవితంలో ఎంతో అహంకారం, పరుషపదాలు వాడకుండా అవతలి వాళ్ళ మీద వ్యంగ్యంగా, అవహేళనగా సెటైర్లు కూడా రాస్తుంటారు. కేవలం నేరుగా ఒక కష్టమైన మాటని అంటేనే తిట్టుగా భావించే సొసైటీలో యండమూరి లాంటి తెలివైన రచయితలను గుర్తించడం కాస్త కష్టమే.
ఐతే, విషయానికి వస్తే.. యండమూరి ఒక స్కూల్ మీటింగ్ లో నోరు జారడం, ఒక పెద్ద మీటింగ్ లో పరువు పోగొట్టుకోవడానికి కారణం అయింది. ‘చిరంజీవి కొడుక్కి మూతి సరిగ్గా లేకపోతే సర్జరీ చేయించి ఇప్పుడు పెద్ద హీరోని చేసారు’ అని ఉదహరించడం, అలాగే చిరంజీవి భార్యని చాలా పర్సనల్ గా తీసుకుని అడ్రెస్ చేయడం మెగా ఫ్యామిలీకి కోపం తెప్పించింది. యండమూరి చేసిన ఈ తప్పుకు సమాధానంగా నాగబాబు ఖైదీ నంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అక్కడికీ యండమూరి తన తప్పుని గుర్తించలేదు.
కొన్ని రోజుల తర్వాత.. ఒక మీడియా ఛానల్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసినపుడు యండమూరి తెలివిగా తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. నాగబాబు చిన్నపిల్లాడు.. పెద్దగా తెలీదు.. వాళ్ళ అన్నయ్య మేమంతా క్లోజ్.. inferiority complex లో బతుకుతున్న అతనికి ఆ స్టేజ్ పై నిలబడి జనాన్ని చూడగానే ఒక్కసారిగా పూనకం వచ్చింది. అతన్ని నేను పట్టించుకోవట్లేదు అని సమాధానం ఇచ్చాడు. అంతకన్నా ముఖ్యంగా.. యండమూరి అసలు విషయాన్ని అమాయకుడిలా కమ్మి పుచ్చేసాడు. ఇంతకీ మీరు చరణ్ విషయంలో ఏమన్నారు అని విలేఖరి అడిగినప్పుడు.. ‘నేను చరణ్ ని దేవిశ్రీ ప్రసాద్ తో పోల్చినందుకు ఆ పిల్లోడికి(నాగబాబు) కి కోపం వచ్చినట్లుంది..’ అని అన్నాడు. కానీ అసలు కారణం అది కాదు. చరణ్ మూతిపై, దాని సర్జరీపై కామెంట్ చేయడం అసలు కారణం. ఈ ఒక్క విషయం చాలు యండమూరి చాలా imperfect పర్సన్ అని చెప్పడానికి. అలాగే ఫాలో అవ్వాల్సినంత గొప్పవాడు కూడా కాదని అర్థం చేసుకోవచ్చు.
Leave a comment