చిత్తూరు నాగయ్య. తెలుగు చిత్ర పరిశ్రమకి అలాగే తమిళులకి ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. గొప్ప నటుడు మాత్రమే కాదు సంగీతం, గానం, దర్శకత్వం వంటి విషయాల్లో కూడా ఆయనకి ప్రావీణ్యం ఉంది. చారిత్రాత్మక, పౌరాణిక పాత్రలను ఎంతో గొప్పగా నటించడం ద్వారా ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. 1938 లో మొదటిసారిగా ‘గృహలక్ష్మి’ అనే సినిమాతో మొదటిసారి తెర మీద కనిపించిన ఆయన కన్నడ, మలయాళ, హిందీ భాషలనుండి కూడా అభిమానులని ఎలా సంపాదించుకున్నారనే విశేషాలను చూద్దాం.
పేరులో చిత్తూరు ఉన్నా ఆయన సొంతూరు మాత్రం గుంటూర్ జిల్లాలోని రేపల్లె. కానీ, వయసు పెరుగుతున్న సమయంలో ఆయన చిత్తూర్ జిల్లా కుప్పంలో పెరగడం వల్ల ఆ పేరలా వచ్చింది. నాటకాలు వేస్తూ ఉండే నాగయ్యకి అప్పుడే అభివృద్ధి చెందుతున్న సినిమాలోకి ప్రవేశించాలి అన్న ఆలోచన కలిగింది. ఇక అంతే.. చెన్నై చేరుకుని అక్కడ సినిమాలలో నటించేవాడు. చేస్తున్న ప్రతి పాత్రకి మంచి గుర్తింపు వస్తూ ఉండటంతో కొద్దికాలంలోనే చాలా ఫేమస్ అయిపోయారు. అవకాశాలు కూడా అలాగే వస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లోనే బీఎ పట్టా పొందిన నాగయ్య.. బడిపంతులుగా పనిచేయడం దగ్గర్నుంచి ఇలా రెండు భిన్న భాషల్లో నటన ద్వారా తనని తాను నిరూపించుకునే స్థాయికి చేరుకున్నాడు.
అలా ఆయన జీవితంలో ఒక పెద్ద టర్న్ కూడా వచ్చింది. అదే.. త్యాగయ్య సినిమా చేసిన తర్వాత వచ్చిన డబ్బులు ఆయన చేత చెన్నై లో 50 ఎకరాల పొలం కొనేలా చేసాయి. ఆ స్థలంలో ఒక ఫిల్మ్ స్టూడియోని స్థాపించాలి అన్న ఆలోచన ఆయనకి ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. అలాగే ఆయనకి స్వయంగా ఉన్న సేవాగుణం అలవాటు కూడా ఎన్నో కష్టాలకు గురిచేసింది. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఐపోతే మళ్ళీ ఎవ్వరూ ఇవ్వరన్న ఆలోచన కూడా చేయకుండా అందరికీ అలా సాయం చేస్తూ ఉండేవాళ్లు. అలాగే ఆయన వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నారు. తన మొదటి భార్య ఒక పాపకి జన్మనిస్తూ చనిపోయింది. తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాక ఆ పుట్టిన పాప కూడా అనారోగ్యంతో చనిపోయింది. తర్వాత రెండో భార్యకి కూడా గర్భం విషయంలో సమస్యలతో ఆమె కూడా మరణించడం నాగయ్యని ఎంతో కలిచివేశాయి.
ఆ దుఖ భారంతో ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తూ ఉండటంతో రమణ ఆశ్రమానికి వెళ్లాడని చెప్తారు. అక్కడ రమణ మహర్షిని కలుసుకున్న తర్వాత ఆయనకూడా నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడే నువ్వు ఇలాంటి వైరాగ్యంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో అక్కడి నుంచి తిరిగి చిత్తూర్ కి వచ్చేసాడట నాగయ్య.
Leave a comment