కాలేజ్ లో స్టూడెంట్ గొడవల నేపథ్యంలో వచ్చిన మూవీ ‘డియర్ కామ్రేడ్’. ఎంతో ఆవేశంతో ఎక్కడ సమస్యలు ఉన్నాయని తెలిసినా వాటిమీద స్పందించాలి అనుకునే ఒక యువకుడిని ఒకమ్మాయి ప్రేమించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంది.. అలాగే.. అదే స్పిరిట్ నుంచి ఆ అమ్మాయి అతి ముఖ్యమైన పాఠాన్ని ఎలా నేర్చుకుంది అని చెప్పడమే ఈ మూవీ కథాంశం.
అప్పటికే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మంచి ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమా తర్వాత చేసిన మూవీ ఇది. 26 జూలై 2019 న విడుదలయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోకి కూడా డబ్ అయి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి మొదటిరోజునే 12 కోట్లు వచ్చాయి. మొదటి వారానికి 26 కోట్లు, మొత్తంగా 31 కోట్లు రాబట్టిన ఈ మూవీ కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదని చెప్పాలి.
మొత్తం 37 కోట్ల బడ్జెట్ తో చేసిన ఈ మూవీ నష్టాల్లోనే ముగిసిపోయింది. ఇంకా ఇతర భాషల్లోకి కూడా డబ్ చేయడం వల్ల అయిన ఖర్చులు కూడా తీరలేదు కాబట్టి మూవీని కొన్న బయ్యర్లకి విపరీతమైన నష్టాలు చవి చూడాల్సి వచ్చిందని చెప్పొచ్చు. కానీ, ఇందులో ఉన్న సందేశాత్మక కోణం అలాగే.. ఒక అందమైన ప్రేమకథ సినిమాని ఎంజాయ్ చేసే విధంగా చేస్తాయి. రెండేళ్ళు గడిచిన సంధర్భంగా ఒక లుక్కేసే ప్రయత్నం చేయండి.
Leave a comment