2017 లో విడుదలైన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద సక్సెస్ చూసిందో మనకి తెలిసిన విషయమే. కథకి అనుగుణంగా పెద్ద స్టార్స్ ని తీసుకుంటే మూవీ పెద్ద హిట్ కొట్టేలా చేయొచ్చనే ఉద్దేశంతో సందీప్ రెడ్డి వంగ మొదట సందీప్ కిషన్ కి కథని చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే.. శర్వానంద్ ని కూడా సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఇక చివరికి విజయ్ తో సినిమా కానించేయొచ్చు అనుకుని షూటింగ్ మొదలుపెట్టారు.
అలాగే, హీరోయిన్ విషయంలోనూ సందీప్ రెడ్డి గట్టి ప్రయత్నమే చేసాడట. స్టార్ హీరోయిన్ ఎవరైనా దొరికితే మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్న ఆలోచనతో కొంతమంది స్టార్ డం ఉన్న హీరోయిన్స్ ని సంప్రదించాడు. అందులో మలయాళ నటి & మోడల్ అయిన పార్వతి నాయర్ కూడా ఉంది. ఆమెకి నేరుగా కథ వినిపించినపుడు ఇందులో పాలు పంచుకోడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించలేదట. మూవీ డ్రగ్స్, ముద్దు సీన్ లు, రొమాన్స్ ఇవన్నీ ఉండటం తనకి చాలా ఇబ్బందిగా అనిపించి మూవీకి ఓకే చెప్పలేదట.
ఈ కారణం మాత్రమే కాకుండా ఆమె సినిమా ఒప్పుకోకపోవడానికి మరో కారణం కూడా ఉంది. అదే, హీరోగా విజయ్ ఉండడం. అప్పటికి విజయ్ కి ఎలాంటి సక్సెస్ కూడా లేదు. స్టార్ డం ని మెల్లగా ఎంజాయ్ చేస్తున్న తనకి ఇలా చిన్న హీరోతో నటిస్తే తర్వాత పెద్ద హీరోలతో అవకాశాలు దొరకావనే ఆలోచనతో సినిమాకి చాలా సింపుల్ గా నో చెప్పేసింది. కానీ, ఈ ఒక్క సినిమానే విజయ్ ని పెద్ద స్టార్ ని చేసేసింది. ఓకే ఒక్క సినిమాతో టాలీవుడ్ బడా హీరోల పక్కన నిలబడ్డాడు.
హీరోగా విజయ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్ కూడా తీసుకున్నాడు. ఇంకా మూవీ తమిళ, హిందీలలోకి కూడా రీమేక్ అవడం, మంచి టాక్ సంపాదించడం జరిగింది. బహుశా ఈ విషయం గురించే పార్వతీ నాయర్ ఎక్కువగా ఆలోచించి ఉండవచ్చు. ఈ మధ్య తన సోషల్ మీడియాలో ‘ask me anything’ అనే ఒక questioning session లో పార్వతిని ఒక అభిమాని అర్జున్ రెడ్డికి సంబంధించిన ప్రశ్న వేశాడు. అందుకు సమాధానంగా పార్వతి ‘అవును, నిజమే. ఆ మూవీ నేను మిస్ చేసుకోకుండా ఉండాల్సింది. కానీ.. నాకు రాసిపెట్టి ఉన్న స్టోరీస్ నాకోసం ఖచ్ఛితంగా వస్తాయి. దానికోసమే ఎదురుచూస్తున్నా..’ అని సమాధానం ఇచ్చింది.
Leave a comment