చాలా కేర్ ఫ్రీగా ఉండే ఒకబ్బాయి తండ్రి.. పెళ్లి చేస్తేనైనా బాగుపడతాడు అనే ఉద్దేశంతో అతనికి పెళ్లి చేయడం కోసం పెళ్లి చూపులకి వెళ్ళి అక్కడ అమ్మాయిని కలుసుకున్నాక.. ఆ అమ్మాయికి కూడా జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆశయం ఉండడం వాళ్ళిద్దరి జీవితాన్ని ఎలా మార్చేసింది చెప్పడం చిత్ర ప్రధాన కథాంశం. 60 లక్షల బడ్జెట్ తో చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ పెద్ద సక్సెస్ కొట్టింది.
ఈ మూవీకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ఇక్కడి నుంచే పాపులర్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. అతనితో పాటు హీరోగా యాక్ట్ చేసిన విజయ్ దేవరకొండ అలాగే అతని ఫ్రెండ్ గా, కమెడియన్ గా నటించిన ప్రియదర్శి పులికొండ కూడా ఈ మూవీతో ఫేమ్ అందుకున్నారు. అర్జున్ రెడ్డి మూవీతో స్టార్ డం అందుకున్న విజయ్ కి ముందుగా చేసిన ఈ మూవీతో కాన్ఫిడెన్స్ ని సంపాదించాడని అనుకోవచ్చు.
సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ మూవీ ఇండియాలోనే కాకుండా.. ఓవర్ సీస్ లో కూడా మంచి సక్సెస్ చూసింది. చాలా తక్కువ బడ్జెట్ తో చేసినప్పటికీ కథలో బలం ఉండడం వల్ల ఏకంగా 30 కోట్లు లాభాలు సంపాదించింది అనేది అంచనా. జూలై 29, 2016 లో రిలీజైన ఈ మూవీ నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2017 సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో, నంది అవార్డ్స్ లో అలాగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ తెలుగు విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డులు అందుకుంది.
Leave a comment