కమల్ హాసన్ కెరీర్ లో అతిపెద్ద హిట్స్‌లో ఒకటి ‘మరో చరిత్ర’ సినిమా. ఆ మూవీలో హీరోయిన్ గా నటించిన అమ్మాయిని చూసి.. ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంది.. కమల్ హాసన్ వంటి హీరో సరసన ఇలాంటి అమ్మాయి నటించడం ఏంటి అన్న కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో.. ఆ అమ్మాయి ఈ మూవీలో నటించడం వల్లే సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాస్తవం రెండోదే అని చెప్పాలి. ఎందుకంటే.. కథకి అనుగుణంగా కె. బాలచందర్ గారు ఆమె పాత్రని ఎంచుకున్నారు.
అసలు ఆమె వెలుగులోకి ఎలా వచ్చారో చూద్దాం. ముందుగా మనం గుంటూరు ప్రాంతానికి వెళ్ళాలి. ఎందుకంటే నటి సరిత స్వంత ఊరు అక్కడే. వాళ్ళ నాన్నకి కొన్ని సినీ పరిచయాలు ఉండేవట. అవి కూడా అలాంటి ఇలాంటి పరిచయాలు కాదు. బాలచందర్ కి ఎంతో సన్నిహితుడైన గణేష్ పాత్రో వంటి వ్యక్తితో. ఆయన ఒకసారి ఏదో పనిమీద గుంటూర్ వచ్చినప్పుడు.. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన అభిలాషని చూసి.. ఈ అమ్మాయిని బాలచందర్ గారు తెలుగులో చేయాలి అనుకుంటున్న సినిమాలోకి హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ నాన్నతో చెప్పాడట. ఇంతకీ.. ఈ అభిలాష ఎవరు అనుకుంటున్నారా..? ఆమె మరెవరో కాదు.. సరిత గారే.
తమిళ వాళ్ళు ఆమె పేరుని సరిగా పలకలేరన్న కారణంతో సరితగా మార్చినట్లు చెప్తారు. అప్పటిదాకా.. మరో చరిత్ర సినిమాలో ఒక హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు.. 100 మంది అమ్మాయిలని చూశాక చివరికి సరితతోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారంటే.. ఆమె కథకి ఎంత చక్కగా సరిపోతుందో దర్శకుడిగా ఆయన చూశారన్నమాట. అలాగే.. నటన కూడా బాగా చేస్తూ ఉండటంతో వేరొక వ్యక్తి కోసం వెతకాల్సిన అవసరం లేదని భావించారు. కానీ, ఆమె ఆ ఒక్క సినిమాతో ఆగిపోలేదు. ఇంకా ఎన్నో ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తమిళ్ లో ఒక స్టార్ గా మారారని చెప్పుకోవచ్చు.
Leave a comment