పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన కెరీర్ లో పెద్దగా హిట్లు లేకపోయినా ఒక స్టార్ హీరోగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. కేవలం సినిమాల ద్వారా తెచ్చుకున్న ఫాలోయింగ్ ని గుర్తింపుని రాజకీయ నాయకుడిగా ఎదిగేంత వరకు తీసుకెళ్లారు. అంతలా తన అభిమానులకి ఆదర్శం అయిన పవన్ కళ్యాణ్ ఆయన కెరీర్ లో ఒక అధ్బుతమైన సినిమా ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు అంటే నమ్మగాలమా.. కానీ అది నిజం. పవన్ కళ్యాణ్ ఒక మంచి అవకాశాన్ని చేజేతులా మిస్ చేసుకున్నారు. ఆయన ఆ అవకాశాన్ని అందుకుని ఉంటే కెరీర్ లో పెద్దగా హిట్స్ లేవన్న అపవాదు నుంచి బయటపడేవారేమో. ఐతే, ఇంతకీ ఆ సినిమా ఏమిటో.. పవన్ కళ్యాణ్ ఆ మూవీ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూయించలేదో చూద్దాం.
ఆ మూవీ మరేదో కాదు. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ ఐపోతుందో ఆడే పండు గాడు..’ అనే మాస్ డైలాగ్ చెప్పి.. యువతను పిచ్చెక్కించిన సినిమా పోకిరీ. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్ లని తిరగరాసిన సినిమా ఇది. ఆ తర్వాత చాలా కాలానికి వచ్చిన మగధీరతో గానీ ఈ మూవీ సెట్ చేసిన రికార్డ్ లు బ్రేక్ అవలేదు. అంతలా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబుని సినిమా చివరి వరకు ఒక పోకిరీగా చూసిన జనం.. ఒక్కసారిగా అతను ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసరికి అందరూ రియల్ ఎంటర్టైన్ మెంట్ అంటే ఏంటో రుచి చూశారు. ఆ ట్విస్ట్ వల్లనే సినిమా అంత పెద్ద హిట్ అయింది అనేది టాక్. ఇక పూరీ జగన్నాథ్ రాసిన మాటలు.. అలాగే ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ పాటతో అన్ని వయసుల వాళ్ళని ఆకట్టుకోవటం కూడా ఒక ప్రధాన అంశం అయింది.
ఇకపోతే, మళ్ళీ మొదటి విషయానికి వద్దాం. అసలు పవన్ కళ్యాణ్ ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు అంటే కారణాలు మరీ పెద్దవేమీ లేకపోవడం ఆశ్చర్యం. ఆయనకి కథ మీద అంత నమ్మకం లేకపోయే సరికి ఒప్పుకోలేదట. ఈ విషయం స్వయంగా మూవీ తీసిన డైరెక్టర్ మన పూరీ జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడన్నమాట. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ మూవీ చేసి ఉంటే.. ఆ రేంజ్ ఇంకెలా ఉండేదోనని ఆయన ఫాన్స్ అనుకుంటున్నారు.
Leave a comment