నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత సోలో జీవితం గడుపుతుంది. మళ్లీ పెళ్లి మాట ఎత్తకుండా సింగిల్‌గా ఉంటూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. అయితే సమంత జీవితంలోకి ఇటీవల మరోక కొత్త మెంబర్ వచ్చారు. ఈ విషయాన్ని సమంత స్వయంగా తెలియజేసింది.సమంతకి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే సమంత దగ్గర హష్ అనే కుక్కపిల్లతో పాటు నాషా అనే మరో పెట్ డాగ్ కూడా ఉంది. వీటితో అప్పుడప్పుడు ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సమంత. ఇక రీసెంట్గా సమంత తన ఫ్యామిలీలోకి మరో పెట్ ని తీసుకువచ్చింది. పిల్లికి గలాటో అని ముద్దుగా పేరు పెట్టుకున్న సమంత దానిని పెంచుకుంటుంది.
అంతేకాదు బెడ్‌పై ఫొటోలు దిగి ఆ పిక్ షేర్ చేసింది. ఇది చూసిన కొందు నెటిజన్స్ పిక్ అదిరింది అని అంటున్నారు. మరి కొందరు పెట్స్ తో మరీ అంత సన్నిహితంగా ఉండకు. అసలే ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నావు. వాటితో బెడ్‌పై పడుకోపెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇబ్బందులు పడతావు అని కొందరు సలహాలు ఇస్తున్నారు. కాగా, కొన్నాళ్లుగా మయోసైటీస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోన్న సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకుంది.. అడ్వాన్స్ ఇచ్చి తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతలకి తిరిగి చెక్కులు ఇచ్చేసిందట. ఇప్పుడు తన పూర్తి దృష్టి ఆరోగ్యంపైనే అంటుంద సమంత.