నందమూరి నటసింహం బాలకృష్ణ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు.. 2014 ఎన్నికలలో తొలిసారిగా హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2019 ఎన్నికలలోను వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఇక బాలయ్యతో కలిసి కొన్ని సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన వారు ఇతర పాత్రలలో నటించిన వారు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారు,
బాలయ్యకు జోడిగా ఎన్నో సినిమాల్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఉన్న విజయశాంతి మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు, ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక మహారధి సినిమాలో నటించిన నవనీత్ కౌర్ ప్రస్తుత మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఇండిపెండెంట్ ఎంపీగా గెలిచారు. ఇక బాలయ్యకు కొన్ని సినిమాలలో విలన్ గా నటించినా దివంగత రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ ఇద్దరు ఎంపీలుగా గెలిచారు.
కైకల మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలిస్తే, రావుగోపాలరావు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇక మరో సీనియర్ నటీమణి శారద కూడా తెనాలి నుంచి ఒకసారి టీడిపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఇక బాలయ్యతో కలిసి కొన్ని సినిమాలలో నటించిన జయసుధ సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే, జయప్రద యూపీలోని రాయ్పూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. అలాగే బాలయ్యకు మరో హిట్ పెయిర్ గా పేరన్న ఆర్కే రోజా నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు ప్రస్తుతం ఏపీ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. ఇలా బాయ్యతో నటించిన వారు రాజకీయాల్లోకి వచ్చి కూడా సక్సెస్ అయ్యారు.