సిద్ధార్థ్ ఒక నటుడిగా మాత్రమే కాకుండా చాలామందికి సామాజిక సమస్యల మీద స్పందించే వాడిగా కూడా తెలుసు. ఇప్పటిదాకా సిద్ధార్థ్ ఎన్నో పొలిటికల్ ఇష్యూస్ మీద స్పందించాడు. ఐతే, చాలామందికి నచ్చటం లేదు. అందుకే ఆయన్ని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఐతే, ఆ కామెంట్స్ కి స్పందించాడు సిద్ధార్థ్.
ఈ మధ్య రిలీజ్ ఐన నారప్ప ట్రైలర్ లో వెంకటేశ్ ఫ్లాష్ బ్యాక్ లో తనకన్నా వయసులో చాలా చిన్న అయిన అమ్మాయితో నటించాడు. దానిపై ఎవరో కామెంట్ చేస్తే.. సిద్ధార్థ్ వాళ్ళకి సమాధానంగా.. ఆ వంకతో సినిమాని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. కథలో భాగంగా అర్థం చేసుకోవాలి తరహా చెప్పినట్టు తెలుస్తోంది.
ఐతే, ఈ కామెంట్ కి రిలేట్ చేస్తూ మరొక సిల్లీ ఫెలో.. నీకు కూడా వయసు తక్కువేం లేదు తరహా పొలుస్తూ చెప్పటంతో.. సిద్ధార్థ్ కాస్త కోపంగా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తుంది. ‘హీరోల వయసు గురించి మాట్లాడేటప్పుడు నేనే గుర్తొచ్చానా? టాగ్ కూడా చేశావ్? సూపర్ రా దరిద్రం అంటూ రియాక్ట్ అయ్యాడు. ఇంకా.. ఎక్కడినుంచి వస్తార్రా మీలాంటోళ్ళు అని కూడా అన్నాడు. ఐతే, అక్కడే దీనికి సంబంధించి చర్చ కూడా జరుగుతుంది.
Leave a comment