ఇంత వయసొచ్చినా సుబ్బరాజు పెళ్లెందుకు చేసుకోలేదో తెలుసా? - Filmylooks Actor Subbaraju About His Marriage
Home Film News ఇంత వయసొచ్చినా సుబ్బరాజు పెళ్లెందుకు చేసుకోలేదో తెలుసా?
Film News

ఇంత వయసొచ్చినా సుబ్బరాజు పెళ్లెందుకు చేసుకోలేదో తెలుసా?

Subbaraju
Subbaraju

సుబ్బరాజు.. ఈయన గురించి తెలుగు ఆడియన్స్‌కి కొత్తగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెగెటివ్ రోల్ అయినా, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా తన స్టైల్ ఆఫ్ యాక్షన్‌తో ఓ సపరేట్ ఇమేజ్, ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. ‘ఖడ్గం’ మూవీతో ఇంట్రడ్యూస్ అయినా కానీ ‘అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి’ తోనే గుర్తింపు వచ్చింది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా వరకు తన సినిమాల్లో సుబ్బరాజుకి మంచి వేషాలిచ్చారు. ‘ఆర్య, సాంబ, భద్ర, పోకిరి, దేశముదురు, పరుగు, నేనింతే, దూకుడు, బిజినెస్ మెన్, మిర్చి’.. ఇలా పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ లో కుమార వర్మగా సుబ్బరాజు రోల్ భలే ఉంటుంది.

రీసెంట్‌గా ఓ ఇంటర్వూలో పెళ్లి గురించి అడిగితే సుబ్బరాజు ఇచ్చిన ఆన్సర్ కాస్త షాకింగ్‌ గానూ, మరికొంచెం సర్‌ప్రైజింగ్‌ గానూ అనిపించింది. సుబ్బరాజు వయసు 45 ఇయర్స్.. 1977 ఫిబ్రవరి 27న ఆయన డేట్ ఆఫ్ బర్త్.. ఇంత వయసొచ్చినా సుబ్బు ఇంకా సింగిల్ గానే ఉన్నాడు. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్నకి ముచ్చటగా మూడు ముక్కల్లో సుబ్బు సమాధానం ఏం చెప్పాడో తెలుసా?

‘‘అసలు పెళ్లెందుకు చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు.. ఇప్పటిదాకా నాకు పెళ్లి అవసరం రాలేదు.. పెళ్లి జరగడం వేరు, చేసుకోవడం వేరు.. పెళ్లంటే ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాను’’ అని చెప్పుకొచ్చాడు.. ప్రతి మాటకీ ముందు పెళ్లి పెళ్లి అంటున్నాడు.. బహుశా పెళ్లి కాలేదనే బాధ వల్లో, చేసుకుంటే బాగుండేదనే ఆలోచనవల్లో సుబ్బరాజుకే తెలియాలి మరి..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...