Home Special Looks పెద్ద హిట్లు లేక కనిపించకుండా పోయిన హీరోలు…
Special Looks

పెద్ద హిట్లు లేక కనిపించకుండా పోయిన హీరోలు…

Actors Who Disappeared Lacking Opportunities

ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడాలి అంటే వాళ్ళకి మంచి టాలెంట్ మాత్రమే కాదు.. ఒక విధంగా అదృష్టం కూడా ఉండాలి. అదే విషయం కొంతమంది విషయంలో నిరూపితం అయింది. ఇక్కడ మెన్షన్ చేయబోతున్న హీరోలంతా కూడా ఒకప్పుడు పెద్ద స్టార్ లు అవుతారు అనుకున్న వాళ్ళే.. కానీ వాళ్ళు ఎక్కువకాలం ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. కొంతకాలం తర్వాత అసలు పూర్తిగా సినిమాలే మానేసి వ్యక్తిగతంగా వాళ్ళు ఎంచుకున్న వృత్తుల్లో ఉండిపోతున్నారు. అలాంటి ఆ హీరోల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

హీరో రాజా

ఒకప్పుడు రాజా పెద్ద హీరో అవుతాడు అనిపించిన వ్యక్తి. అతను నటించిన సినిమాలో ఆనంద్ బాగా గుర్తింపు తెచ్చుకున్న సినిమా. ఆ తర్వాత హీరోగా వెన్నెల అనే సినిమాలో కూడా నటించాడు. రాజా ఒక మెయిన్ క్యారెక్టర్ గా ఆ నలుగురు, స్టైల్ వంటి సినిమాల్లో కూడా నటించాడు. కానీ.. మళ్ళీ పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయాడు. ఇక అవకాశాలు రావడం మానేసినప్పటినుంచి సినిమాల వైపు చూడటం కూడా మానేశాడు. క్రిస్టియన్ అయిన రాజా ఇప్పుడు ప్రస్తుతం ఒక పాస్టర్ గా పని చేస్తున్నాడనేది టాక్.

తనీష్

చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి చాలా మందికి పరిచయం అయ్యాడు తనీష్. అయినా ఆ పాపులారిటీ తనీష్ కి ఎక్కువకాలం పనికిరాలేదు. అతను చేసిన మేం వయసుకి వచ్చాం, రైడ్, తెలుగయబ్బాయి, నచ్చావులే, రంగు, ప్రేమిక వంటి సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. వాటిలో ఏవీ పెద్ద హిట్లుగా నిలవలేదు. చివరిసారి బిగ్ బాస్ లో కనిపించిన తనీష్ కాస్త పాపులర్ అయినప్పటికీ పెద్ద స్టార్ గా మాత్రం ఎదగలేకపోయాడు.

శివబాలాజీ

గత సంవత్సరం బిగ్ బాస్ విన్నర్ అయినప్పటికీ సినిమాల్లో అవకాశాల విషయంలో కూడా దక్కించుకోలేని మరో హీరో నటుడు శివబాలాజీ. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి.. హీరోగా చేసే ప్రయత్నం చేసినా శివ బాలాజీని అదృష్టం వరించలేదు.

వడ్డే నవీన్

చాలా బాగుంది, ఆదిలక్ష్మి, పెళ్లి, ప్రియా ఓ ప్రియా, ప్రేమించే మనసు వంటి సినిమాల్లో నటించి అప్పట్లో బాగా పాపులర్ అయిన వడ్డే నవీన్ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పారు. ఆయన తండ్రి వడ్డే రమేష్ ఒక నిర్మాత. అయినా నవీన్ కి పెద్ద హిట్లు రాకపోవడంతో సినిమాల్లో నటించడం మానేశారు.

హీరో రోహిత్

జానకి వెడ్స్ శ్రీరామ్ ఫేమ్ హీరో రోహిత్ ఒకప్పుడు పెద్ద హీరో అవుతాడేమో అనిపించాడు. అనగనగా ఓ కుర్రాడు, నేను సీతామహాలక్ష్మి, సొంతం, గర్ల్ ఫ్రెండ్, గుడ్ బాయ్, మా అన్నయ్య బంగారం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రోహిత్ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకోవాల్సి వచ్చింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ లో అతను పోషించిన పాత్ర చాలా చిన్నది. ఆ తర్వాత దాదాపు కనుమరుగయ్యారు రోహిత్.

రాజ్ తరుణ్

చిన్న హీరోగా సినిమాలు మొదలుపెట్టి పెద్ద హీరో అవుతాడు అనే హైప్ లో ఎక్కువకాలం ఉండలేకపోయాడు రాజ్ తరుణ్. మొదట్లో పైకి వస్తున్నాడు అనిపించినా.. మెల్లగా అతని సినిమాలకి అభిమానులు కరువయ్యారు. ఇప్పుడు అతను చేస్తున్న సినిమాలు కూడా దాదాపు లేనట్టుగానే ఉంది.

నవదీప్

నవదీప్ ని కూడా ఈ లిస్ట్ లో చేర్చవచ్చు. ఏవో కొన్ని సినిమాల్లో హీరోగా, హీరో ఫ్రెండ్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన నవదీప్ తరువాత మెల్లగా కనుమరుగైపోయాడు.

వరుణ్ సందేశ్

తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ వంటి సినిమాలు యూత్ ని బాగా ఎంటర్టైన్ చేశాయి. కానీ ఆ సక్సెస్ వరుణ్ సందేశ్ కి ఎక్కువకాలం ఉపయోగపడలేదు. తర్వాత పెద్ద హిట్ లు చేయగలిగే సినిమా అవకాశాలు రాకపోవడం.. అతన్ని మెల్లగా ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పేలా చేశాయి.

వేణు

హీరో వేణు 90 లలో ఒక పెద్ద హీరో. అతను చేసే సినిమాలు బాగా ఆడుతుందేవి. కానీ తర్వాత్తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు వేణు. హిట్ సినిమాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి కూడా వెనుకాడలేదు. అయినా లాభం లేకపోయింది.

తరుణ్

ఇక తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుజల్లు, నువ్వే నువ్వే, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు వంటి పెద్ద హిట్ లతో రాణించి కూడా తర్వాత సినిమాలు చేయలేకపోయాడు తరుణ్. ప్రేమ కథతో సినిమా చేయాలంటే తరుణ్ వైపు చూసే రోజులని ఇండస్ట్రీలో ఉన్నంతకాలం తరుణ్ బాగా ఎంజాయ్ చేశాడనే చెప్పాలి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...