Abhirami: ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది సెలబ్రిటీలు, సమాన్యులకు మధ్య వారధిలా మారింది. దీని కారణంగానే మనుషులు మధ్య దూరం తగ్గిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే.. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా టచ్‌లో ఉండొచ్చు.
ఇప్పటికే కనుమరుగైపోయిన ఎంతోమంది సెలబ్స్ని సోషల్ మీడియాలోనే చూసి ఆశ్చర్యపోయాం. అలా కొన్నాళ్లక్రితం బ్యూటిఫుల్ యాక్ట్రెస్‌గా ఆడియన్స్‌ని అలరించిన అభిరామి నెటిజన్లకు కనిపించారు. మలయాళంకు చెందిన అభిరామి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు.
శ్రీహరి ‘థ్యాంక్యూ సుబ్బారావ్’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన అభిరామి ‘చెప్పవే చిరుగాలి’ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాతృభాష మలయాళంలో బాలనటిగా, తర్వాత కథానాయికగానూ నటించారు. తమిళ్, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసి, కొంత గ్యాప్ తర్వాత టీవీ హోస్ట్‌గానూ మెప్పించారు.
https://www.instagram.com/p/CfF3fp9pVoP/
https://www.instagram.com/p/CeVN-7Uha6a/
Leave a comment