ఆదిపురుష్ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల చేయగా, ఇది సోషల్ మీడియాని షేక్ చేసింది. అన్ని భాషల్లో కూడా ఆదిపురుష్ ట్రైలర్ సెన్సేషన్ గా నిలిచింది. ఆదిపురుష్ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అయితే ఆదిపురుష్ చిత్ర యూనిట్‌పై కొందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల తిరుమల మాడ వీధుల్లో కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తనని తప్పు పట్టారు.ఇక దర్శకుడు ఓం రౌత్ చిత్రాన్ని సరిగ్గా తెరకెక్కించలేదని.. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు పాత్రలు అంత ఒరిజినాలిటీగా లేవని విమర్శలు గుప్పించారు.
ఇక తాజాగా దర్శకుడితో పాటు నిర్మాతలపై విమర్శలు చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్ లో ఆంజనేయ స్వామి కోసం ఒక సీట్ ప్రత్యేకంగా కేటాయిస్తామని అన్నారు. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు వస్తాడని ప్రతీతి ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు. అయితే ఆదిపురుష్ చిత్ర యూనిట్ హనుమంతుడికి ప్రత్యేకంగా సీట్ కేటాయించేది భక్తితో కాదని.. డబ్బు కోసం అని విమర్శలు గుప్పించారు గాసిప్ రాయుళ్లు. హనుమంతుడికి కేటాయించిన సీట్ పక్క సీట్లకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సీట్ ధరల్ని అధిక మొత్తంలో పెంచి విక్రయించనున్నారని అన్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తూ అవన్నీ ఫేక్. తప్పుడు వార్తలు నమ్మోద్దు . హనుమంతుడి సీటు పక్క సీట్ల టికెట్ ధరలు కూడా సాధారణంగానే ఉంటాయని అన్నారు.