Adipurush Pre-release Event: బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన నటించిన ఆదిపురుష్‌పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. భారీ బడ్జెట్‌తో ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జూన్ 16న ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదట టీజర్‌కి నెగెటివ్ టాక్ వచ్చిన తర్వాత విడుదలైన ట్రైలర్ మాత్రం భారీ అంచనాలే పెంచింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ సీత పాత్రలో నటించింది. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలకి ప్లాన్ చేస్తున్నారు.
చిత్రంలో బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఉండడంతో పాటు ప్రభాస్‌కి నార్త్ ఇండియాలో చాలా మంది అభిమానులు ఉన్న నేపథ్యంలో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చిన కూడా భారీగా వసూళ్లు రాబడుతుందని అంటున్నారు. చిత్రంలో రావణుడిగా సైఫ్ అలీఖాన్, ఆంజనేయుడిగా దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. రామాయణం ఆధారంగాఈ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కించాడు. ఇప్పటికే రామాయణం నేపథ్యంలో చాలా సీరియల్స్, సినిమాలు వచ్చాయి. అయితే ఓం రావత్ సినిమా ఎలా తీశాడని అనే దానిపై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 6న తిరుపతిలో భారీ ఎత్తున జరపబోతున్నట్టు ఇన్‌సైడ్ టాక్. ఇప్పటికే ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఇక ఇండియన్ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ జరుగుని రేంజ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలని చిత్ర బృందం భావిస్తుందట. జై శ్రీరామ్ అనే శబ్దం వచ్చేలా బాణసంచాను పేల్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ఇక ఈ ఈవెంట్‌కి దాదాపు యాభై లక్షలకు పైగా ఖర్చు చేయనున్నారని అంటున్నారు. ముంబై నుంచి రెండొందల డ్యాన్సర్లు, రెండొందల సింగర్లు ఈవెంట్ కోసం ప్రత్యేకంగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను జీఎస్టీతో కలిసి రూ.185 కోట్లకు కొనుగోలు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.