Adipurush in USA: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చారిత్రాత్మక చిత్రం ఆదిపురుష్ ఎట్టకేలకు నేడు థియేటర్స్ లోకి వచ్చింది.ఎన్నో రోజుల నుండి ప్రభాస్ అభిమానులతో పాటు రామ భక్తులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. భారతీయులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆరాధించే పుణ్యపురుషుడు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించడంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. అయితే ఎన్నో వివాదాల మధ్య నలుగుతూ.. అదే విధంగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్ నటించగా .. జానకి పాత్రలో కృతి సనన్.. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు. రామాయణం పురాణం ఆధారంగా చేసుకొని దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
బుక్ మై షోలోనే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 1 మిలియన్ టిక్కెట్స్ సేల్ కావడం చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. తొలి రోజు ఆదిపురుష్ చిత్రం అవలీలగా వంద కోట్లు రాబట్టడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి 2, సాహో చిత్రాలు మాత్రమే ఈ రేంజ్ ఓపెనింగ్స్ సాధించగా.. ఇప్పుడు ఇది కూడా సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఒక్కొక్కరు ఒక్కోలా అభిమానాన్ని చాటుకుంటున్నారు. రీసెంట్గా యూఎస్‌లో ఆదిపురుష్ కోసం నిర్వహించిన బిగ్గెస్ట్ ర్యాలీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
విశాలమైన ప్రాంతంలో వందలాది కార్లను పార్క్ చేసిన ఇండియన్స్.. ఆ కార్లన్నింటినీ రామనామం(SRIRAM) ఆకృతిలో నిలిపి అందరి దృష్టిని ఆకర్షించారు. డ్రమ్స్, వాయిద్యాలతో నానా హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రాముని ఇతిహాస యాత్రను చూసేందుకు ఈ బిగ్గెస్ట్ ర్యాలీ విట్నెస్గా నిలిచిందని పలువురు చెప్పుకొస్తున్నారు. కాగా ఆదిపురుష్ మూవీ 9000 స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుంది.. తెలుగులో 1500, మిగతా భాషలన్నీ కలిపి 4000, ఓవర్సీస్లో 3500 స్క్రీన్స్ కేటాయించినట్టు సమాచారం. ఇప్పటి వరకు అయితే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది.