3 Decades Of AJITHISM: ‘అల్టిమేట్ స్టార్’, ‘తల’ అజిత్ కుమార్.. ఈ పేరు చేప్తే చాలు ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవ్.. సిల్వర్ స్క్రీన్ మీద అజిత్ కనిపిస్తే చాలు.. వీరాభిమానుల అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోతాయ్. అజిత్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 2022 ఆగస్టు 3తో సక్సెస్ ఫుల్‌గా 30 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.
తెలుగు వాడైన అజిత్ తమిళ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా ఎదిగారు. ఆయన టాలెంటెడ్ యాక్టరే కాదు.. మంచి మనసున్న వ్యక్తి.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఆయనది. హైదరబాద్‌లో బైక్ మెకానిక్‌గా పని చేసిన అజిత్.. కోలీవుడ్‌లో బాక్సాఫీస్ కింగ్ మేకర్‌గా ఎదగడం వెనుక ఎంతో కృషి, శ్రమ, పట్టుదల ఉన్నాయి.
‘ప్రేమ పుస్తకం’ అజిత్ నటించిన డైరెక్ట్ తెలుగు సినిమా.. ‘ప్రేమలేఖ’ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తమిళనాట స్టార్‌గా ఎదిగిన తర్వాత పలు సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న ‘భోళా శంకర్’.. ‘వేదాళం’ రీమేక్.. పవన్ కళ్యాణ్ చేసిన ‘కాటమరాయుడు’ (వీరం), ‘వకీల్ సాబ్’ (నేర్కొండ పార్వై) సినిమాలు రీమేక్ చేశారు.
తమిళ్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ చేసిన ‘తల’ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’, ‘నేర్కొండ పార్వై’, ‘వలిమై’ వంటి వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన అజిత్.. నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు H.వినోద్‌లతో కలిసి వరుసగా మూడో చిత్రం చేస్తున్నారు. అజిత్ నటిస్తున్న 61వ సినిమా ఇది.
సినిమాలతో పాటు ఫార్ములా వన్ రేసింగ్‌లోనూ.. రైఫిల్ షూటింగ్‌లోనూ అజిత్ టాపర్ అనే విషయం తెలిసిందే. దేశ, విదేశాల్లో పలు రేసుల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ఇక నటుడిగా ప్రేక్షకాభిమానుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారాయన.
మూడు దశాబ్దాలుగా తమిళ్, తెలుగు ప్రేక్షకులను అన్‌స్టాపబుల్‌గా అలరిస్తున్న అజిత్.. ఫిలిం ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Leave a comment