Akkineni Nageshwar Rao: టాాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ఓ స్థాయిలో ఉండేవారు. అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. వారు ప్రతి పాత్రలోనూ నటులుగా కాకుండా.. పాత్రలో లీనమైపోయి జీవించేసేవారు. అలా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరి కలిసి నటిస్తుంటే ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా వేషాలు వేసి స్టార్ హీరో స్థానాన్ని సుస్థిరంగా సంపాదించుకున్నారు. అలా ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా నాగేశ్వరరావు తమిళం, హిందీ భాషల్లో కూడా నటించారు. ఇలా తెలుగు, హిందీ, తమిళం భాషలు కలిపి మొత్తం 250 సినిమాలకు పైగా నటించారు.
అక్కినేని నాగేశ్వరరావు హీరోగానే కాకుండా సోదరుడిగా, తండ్రిగా, తాతగా కూడా నటించి మెప్పించారు. ఆయన ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన సినిమాలతో ఎప్పుడు సజీవంగానే ఉంటారు. దాదాపు 70 సంవత్సారాలు నాన్ స్టాప్ గా సినీ ఇండస్ట్రీలో ఆయన సేవలు అందించి తన 91 వ సంవత్సరంలో క్యాన్సర్ కారణంగా కన్ను మూశారు. ఆయన మరణించడానికి ముందు కొన్ని రోజుల పాటు అక్కినేని నాగేశ్వరరావు అంతులేని మనోవేదనను అనుభవించారు. చివరకు ఆయన తన సొంత కుటుంబాన్ని కూడా దగ్గరకు రానివ్వలేదట. అక్కినేని గారి చివరి రోజుల్లోనూ కాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకున్నారు.
ఆ టైమ్ లో ఆయన చర్మం ఊడి వచ్చేస్తూ ఉండేది. అందుకే ఆ పరిస్థితిలో బయటి వారిని, సొంత కొడుకులను కూడా చూసేందుకు ఇష్టపడలేదు. ఎవరైనా తన పరిస్థితిని చూసి బాధపడితే తన ఫ్యామిలీ వీక్ అవుతుందని అనుకుని నాగేశ్వరరావు ఎవ్వర్ని తన గదిలోకి కూడా రానివ్వలేదట. అక్కినేని నాగేశ్వరరావుకు మంచి ఆత్మీయుడు అయిన నటుడు కాదంబరి కిరణ్ ఈ విషయాల్ని చెప్పారు. నాగేశ్వరరావు ఆయన కెరీర్ చివర్లో మనం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆయన మరణించారు. ఈ సినిమా ఏఎన్నార్ తుది శ్వాస విడిచిన నాలుగు నెలల తర్వాత రిలీజ్ చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.