Raksha Bandhan Trailer: చేసే ప్రతి సినిమాలోనూ కథ పరంగా, క్యారెక్టర్ పరంగా వైవిధ్యత చూపించాలను తాపత్రయపడే యాక్టర్స్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముందుంటారు. హిందీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ.. ఏడాదిలో ఎక్కువ రిలీజులు చేసేది కూడా అక్షయ్ కుమారే..
అక్షయ్, భూమి ఫడ్నేకర్ జంటగా.. ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్ట్ చేస్తున్న ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘రక్షాబంధన్’.. రీసెంట్గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత సింపుల్గా స్టోరీ ఇదే అనిపిస్తుంది కానీ.. మనసుకి హత్తుకునేలా ఎంత బాగా తీశారో.. తప్పకుండా చూడాలి అని కూడా అనిపిస్తుంది.
చెల్లెళ్ల పెళ్లి కోసమే కష్టపడే అన్న క్యారెక్టర్లో అక్షయ్ నటన ఆకట్టుకుంటుంది. తన మార్క్ కామెడీతో పాటు ఎమోషన్స్ క్యారీ చేస్తూ కంటతడి పెట్టించారు అక్షయ్. నలుగురు చెల్లెళ్లు, అరకొర సంపాదన, మరోవైపు తనకి కాబోయే భార్యని వెయిట్ చేయించడం.. ఇన్ని సమస్యలని హీరో ఒక్కడే ఎలా పరిష్కరించుకుంటాడు అనేది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు మాజీ కోడలు కనికా థిల్లాన్, హిమాన్షు శర్మ ఈ కథ రాశారు. జీ స్టూడియోస్, అల్కా హీరానందానీతో పాటు డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 11న ‘రక్షాబంధన్’ వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది.
Leave a comment