Ali-Suma: ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ప్రేక్షకుల ఎంటర్ టైన్ మెంట్ కి కొదు లేదు అనే చెప్పాలి. సీరియల్స్ షోస్ తో పాటు రియాలిటీ షోస్ కూడా ఎక్కువయ్యాయి. అలాగే టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా పోటీ గట్టిగానే ఉంటుంది. దాన్ని తట్టుకుని నిలబడాలంటే చాలానే టాలెంట్ ఉండాలి. తమ ప్రోగ్రామ్స్ లో ఎప్పటికప్పుడు కొత్తదనం లేకపోతే చాలా కష్టం. ఇక ప్రజంట్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించే టీవీ ఛానెల్స్ లో ఈటీవీ ఎప్పుడూ ముందుంటుంది. ఎన్నో కామెడీ షోస్ తో పాటు సాంగ్స్, డాన్స్ షోస్ ను కూడా రన్ చేస్తున్నారు. మిగతా ఛానెల్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈటీవీ ఇచ్చిన హైప్ ని మిగతా ఛానెల్స్ ఇవ్వలేకపోయాయనే మాట వాస్తవం. కానీ ప్రజంట్ సిట్యూవేషన్స్ మారిపోయాయి. ఈటీవీ ఇప్పుడు టీఆర్పీ విషయంలో మూడో ప్లేస్ కి వచ్చేసింది.
ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కానీ ఈటీవీ ఇప్పటికీ పాత స్టైల్ నే ఫాలో అవుతుంది. ఎస్పీ బాలు గారి ప్లేస్ లో ఎస్పీ చరణ్ ను పెట్టి పాడుతా తీయగా ప్రోగ్రామ్ ప్రజంట్ అస్సలు సక్సెస్ రేట్ లేదు. ఇక జబర్థస్త్ షోలో కూడా అవే రిపీటెడ్ స్కిట్స్ తో ప్రేక్షకుల్లో బోరింగ్ ఫీలింగ్ ను కలిగిస్తున్నాయి. సుదీర్, రష్మీ, హైపర్ ఆదిలు తమ బెస్ట్ ఇచ్చినా.. అవి మినిమం ఎంగేజ్ కూడా అవ్వడం లేదు. ఇక రీసెంట్ గా సుమ లేటెస్ట్ గా సుమ అడ్డా అంటూ స్టార్టింగ్ లోనే మెగాస్టార్ తో షో చేసినా.. అది అంతగా క్లిక్ అవ్వలేదు. రొటీన్ పంచులతో అలాగే లాక్కోస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇక ఆలీతో సరదాగా షోలో కూడా సాలిడ్ గెస్ట్ లు లేక కాస్త డల్ అయ్యిందనే చెప్పాలి.
రీసెంట్ గా వెన్నెల కిషోర్ తో ఓ కపుల్ షోను స్టార్ట్ చేసినా.. అది కూడా మంచి హైప్ ను క్రియేట్ చేయలేకపోయింది. ఆలీతో ఆల్ ఇన్ వన్ అనే షో స్టార్ట్ చేసి కొన్ని మార్పులు చేసి ఏదో డిఫరెంట్ ప్రోగ్రామ్ ని అయితే సెట్ చేశారు. ఇంత ఖర్చు పెట్టే షోస్ కి సీరియల్ రేటింగ్ కన్నా తక్కువ రావడంతో మరింత డీలా పడుతున్నారు మేకర్స్. ఒకప్పుడు తమ టాలెంట్ తో పోటీ పడే యాంకర్లు.. ఇప్పుడు యావరేజ్ రేటింగ్స్ విషయంలో యాంకర్ సుమ, ఆలీలు పోటీ పడటం ఒక హైలెట్ గా మారింది. ఇప్పటికైనీ ఈటీవీ వాళ్లు అప్డేట్ అయ్యి.. ఇప్పుడు ఉన్న యూత్ కి కనెక్ట్ అయ్యేలా ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేస్తే.. రేటింగ్ విషయంలో మార్పు ఉంటుందేమో చూడాలి మరి.