Nagarjuna: యంగ్ అండ్ డైనమిక్ టాలెంట్ ను ప్రజంట్ చేసే నటుల్లో నాగార్జున కూడా ఒకరు. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాలతో నూతన దర్శకుల్ని పరిచయం చేశారు. మరి టాలీవుడ్ కి నాగార్జున సినిమాతో పరిచయం అయిన నూతన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో శివ మూవీ ఓ సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మను పరిచయం చేశారు. శివ మూవీ టాలీవుడ్ లో ఓ రేంజ్ లో హిట్ అవ్వడంతో హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ కి ఆర్జీవీని ఇంట్రడ్యూస్ చేశారు. నాగార్జున నటించిన సంకీర్తన అనే మూవీతో గీతాకృష్ణ అనే డైరెక్టర్ ను పరిచయం చేశారు. నెక్ట్స్ జైత్రయాత్ర అనే మూవీలో ఉప్పలపాటి నారాయణరావును డైరెక్టర్ గా పరిచయం చేశారు. కోలీవుడ్ లో రచ్చకన్ అనే మూవీతో ప్రవీణ్ గాంధీని పరిచయం చేశారు. ఈ మూవీని తెలుగులో రక్షకుడు అనే టైటిల్ తో డబ్ చేశారు.
నెక్ట్స్ శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి అనే సినిమాతో వైవియస్ చౌదరినీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్ లోనే సీతారామరాజు సినిమా చేసి హిట్ అందుకున్నారు. నెక్ట్స్ నువ్వు వస్తావని సినిమాతో వంకినేని రత్నప్రతాప్ అనే డైరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశారు. నిన్నే ప్రేమిస్తా అనే మూవీతో ఆర్ ఆర్ షిండేను, ఎదురులేని మనిషి మూవీతో జొన్నలగడ్డ శ్రీనివాసరావును దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
సంతోషం మూవీతో దశరథ్ ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత అగ్ని వర్ణ అనే హిందీ మూవీతో అర్జున్ సంజనాని, మాస్ మూవీతో లారెన్స్ రాఘవను, కేడీ మూవీతో కిరణ్ ను ఇలా ఎంతోమంది డైరెక్టర్స్ ని పరిచయం చేశారు. సూపర్ హిట్ అయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో కళ్యాణ్ కృష్ణ కురసాల మూవీని, నాగ కోటేశ్వరరావుతో నిర్మల కాన్వెంట్ మూవీని చేశారు. నెక్ట్స్ వైల్డ్ డాగ్ మూవీతో అహిషోర్ సోలమన్ డైరెక్టర్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఇక ఇప్పుడు నా సామిరంగ అనే సినిమాతో విజయ్ బిన్ని అనే ప్రముఖ కొరియోగ్రాఫర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.