Adipurush: భారతీయ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలన్నింటికి మంచి ఆదరణ దక్కింది. ఇక ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే చిత్రం తెరకెక్కడంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే కొందరు మాత్రం మూవీ టీజర్,ట్రైలర్ చూసి పెదవి విరిచారు. కథని పూర్తిగా వక్రీకరించారని, సంభాషణలు ఏమంత బాగోలేవని కొందరు మండిపడ్డారు.ఈ నేపథ్యంలో నేపాల్ దేశంలో ఇండియన్ సినిమాలపై కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. నేపాల్‌లోని పోఖరా మెట్రోపాలిటన్ సిటీలో ఆదిపురుష్ సినిమాలోని ఒక డైలాగ్పై వివాదం తలెత్తడంతో భారతీయ చిత్రాల ప్రదర్శనను నిషేధించాలని ఖాట్మండు పోఖరా మేయర్ నిర్ణయం తీసుకున్నారు.
రాముని సతీమణి నేపాల్ లో పుట్టినట్టు చరిత్ర చెబుతుండగా, ఆదిపురుష్ చిత్రంలో మాత్రం ఇండియాలో పుట్టినట్టు చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగా నేపాలీ నగరంలోని సినిమా హాళ్లలో బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని పోఖరా మేయర్ ధనరాజ్ ఆచార్య ఆదేశాలు జారీ చేశారు. ‘ఆదిపురుష్’ చిత్రంలో సీత జన్మస్థలం గురించిన తప్పును సవరించకపోతే ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్‌తో పాటు ఏ భారతీయ చిత్రాలను ప్రదర్శించేందుకు అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు. నేపాల్ సెన్సార్ బోర్డ్ కూడా ఇదే కారణంతో చిత్ర ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. ఈ క్రమంలోదిగొచ్చిన చిత్ర మేకర్స్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది.
సీత భారతదేశపు కుమార్తె అని ఆదిపురుష్ చిత్రంలో ప్రస్తావించడంతో గురువారం ట్వీట్ చేసిన కాఠ్మండు మేయర్ షా.. ఇండియా, నేపాల్‌లో ఆ డైలాగ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. చిత్ర మేకర్స్ కనుక ఈ డైలాగ్‌ను తొలగించకుంటే సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వబోమని వారు తేల్చి చెప్పారు. ఇక ఇప్పటికే చిత్రంలోని ప్రేక్షకులకు ఇబ్బంది కలిగే కొన్ని డైలాగ్స్ ను కూడా మార్చబోతున్నామని మేకర్స్ ప్రకటించిన విషయం మనకు విదితమే. న్యూ వెర్ష్ న్ ని మరో వారంజ రోజుల్లో ఆడియెన్స్ థియేటర్లలో చూడొచ్చు అయితే ఏది ఏమైనా సినిమాకి నెగెటివ్ టాక వస్తున్నా కూడా ఆదిపురుష్ మూడు రోజుల్లో రూ.300 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.