Allu Aravind: మెగా ఫ్యామిలీ ఇంట మరి కొద్ది రోజులలో పెద్ద వేడుక జరగనుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెండ్లి బంధంతో ఒక్కటి కానుండగా, వీరి పెళ్లి వేడుకని గ్రాండ్గా జరిపే ప్లాన్స్ చేస్తున్నారు. జూన్ 9న వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకి ముందు ఈ జంట ఏ నాడు కలిసి కనిపించి లేదు. కాని ఇద్దరు ప్రేమలో ఉన్నారని బాగా ప్రచారం జరిగింది. దానిపై ఓ సారి లావణ్య స్పందిస్తూ తామిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పింది. తీరా చూస్తే గత నెలలో ఇద్దరు నిశ్చితార్థం చేసుకొని అందరికి షాక్ ఇచ్చారు. వేడుకకి మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తో పాటు చిరంజీవి దంపతులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
నిశ్చితార్థం తర్వాత ఈ జంట విదేశాలలో తెగ చక్కర్లు కొడుతుంది.అప్పుడప్పుడు లావణ్య త్రిపాఠి టూర్ ఫొటోలని కూడా షేర్ చేస్తుంది. ఇవి చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగా ప్రొడ్యూసర్ ల్లు అరవింద్ బేబీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని నేను ఏదో సరదాగా అంటే లావణ్య త్రిపాఠి నిజంగానే మా వాడిని పెళ్లాడుతుందంటూ నవ్వేశారు. అల్లు అరవింద్ నిర్మాణంలో చావు కబురు చల్లగా అనే చిత్రం తెరకెక్కగా, ఇందులో లావణ్య త్రిపాఠి-కార్తికేయ జంటగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్ సమయంలో అరవింద్ మాట్లాడుతూ.. ఎక్కడో నార్త్ ఇండియా నుండి వచ్చిన నువ్వు తెలుగు నేర్చుకొని బాగా మాట్లాడుతున్నావు. ఇక్కడే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో బాగుంటుంది అని అన్నాడు.
అప్పుడు ఆ మాటలని లావణ్య కూడా లైట్ తీసుకుంది. కాని తీరా చూస్తే తెలుగు అబ్బాయినే కాదు, మెగా ఇంటి అబ్బాయితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది . కాగా అల్లు అరవింద్ ఆయన బ్యానర్ లో లావణ్య త్రిపాఠి మూడు చిత్రాలు చేసింది. మరి ఆ సమయంలో ఈ అమ్మడి ప్రేమ వ్యవహారం గురించి తెలిసే మాట్లాడాడా లేక సరదాగా మాట్లాడారా అని కొందరు భావించారు. ఏదైతేనేం లావణ్య మరి కొద్ది రోజులలో మెగా కోడలి ప్రమోషన్ అందుకోనుంది.