Amala: అక్కినేని నాగార్జున సతీమణి, ప్రముఖ సినీ నటి అమల ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన విషయం మనందరికి తెలిసిందే. నిర్ణయం, శివ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అమల ఆ తర్వాత నాగార్జునని వివాహం చేసుకొని సినిమాలకి పూర్తిగా దూరమైంది. కేవలం కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ మరోవైపు సోషల్ సర్వీస్ చేస్తుంది. అమల ఐర్లాండ్‌కి చెందిన మహిళ కాగా, ఆమె తండ్రి బెంగాల్ నేవీ ఆఫీసర్ ముఖర్జీ. తల్లి ఐర్లాండ్‌కి చెందిన మహిళ. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోగా, ఆ దంపతులకి అమల పుట్టింది. అమల పుట్టాక వారు వైజాగ్, చెన్నై వంటి ప్రాంతాలలో నివసించారు.
అమల బాలీవుడ్లో చాలా చిత్రాలే చేసింది. చాలా మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. సంజయ్ కపూర్ డెబ్యూ మూవీలో అమల హీరోయిన్ కాగా, ఆ ప్రాజెక్ట్ అనుకోని కారణాల వలన ఆగిపోయింది. రీసెంట్గా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు సంజయ్ కపూర్. 1995లో ప్రేమ్ అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో హీరో అయిన సంజయ్ కపూర్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తున్నాడు అయితే 1987లో ఓ ప్రాజెక్ట్ కోసం సంజయ్ కపూర్, అమలను హీరో హీరోయిన్స్ అనుకున్న మేకర్స్ వారిద్దరిపై ఫొటో షూట్ కూడా చేశారట.
కాని ఆ ప్రాజెక్ట్ పలు కారణాల వలన ఆగిపోయింది. ఆ తర్వాత ప్రేమ్ అనే సినిమాతో హీరోగా మారాడు. అయితే అమల అప్పటికే తమిళంలో చాలా బిజీ యాక్ట్రెస్‌గా ఉంది. ఆమెతో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని చెప్పిన సంజయ్ కపూర్ అప్పటి ఫొటో కూడా షేర్ చేశాడు. 1987లో బ్యూటిఫుల్ అమలతో నా ఫస్ట్ ఫోటో షూట్. నా డెబ్యూ మూవీ హీరోయిన్ అమల కావాల్సింది, కాని అది వర్కవుట్ కాలేదని తన పోస్ట్‌కి కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై సంజయ్ కపూర్ భార్య.. మహీప్ స్పందిస్తూ.. 1987లోనా… అప్పటికి నా వయసు కేవలం 14 ఏళ్ళు అని చెప్పుకొచ్చింది.