Pawan Kalyan Amitab: చిరంజీవి సోదరుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అనే పేరు ప్రభంజనం. ఆయనకి దేశ విదేవాలలో సైతం వీరాభిమానులు ఉన్నారు. పవన్ సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్. పవన్ నటించిన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్‌గానే ఆడినా.. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు పవన్ క్రేజ్ మరింత పెంచాయి. ఇక అదే సమయంలో కొత్త దర్శకుడు ఏ కరుణాకరణ్ వచ్చి పవన్‌కి తొలి ప్రేమ కథ చెప్పడం, సినిమా ఓకే అనడం. చకా చకా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయడంతో మూవీ పెద్ద హిట్ అయింది.
పవన్ కల్యాణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ మెమురబుల్ చిత్రంగా నిలిచిన తొలి ప్రేమ చిత్రం ఇటీవల 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రీసెంట్గా రీరిలీజ్ చేయగా, రీరిలీజ్‌లో కూడా ఈ చిత్రం మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. అయితే చిత్ర రీరిలీజ్ సందర్భంగా కరుణాకరన్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీకి సంబంధించి అనేక విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో చిత్ర క్లైమాక్స్ చూసి అమితాబ్ బచ్చన్ చాలా చిరాకు పడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. హీరోయిన్ని అమితంగా ప్రేమించే పవన్ కల్యాణ్ క్లైమాక్స్ టైంలో కూడా తన ప్రేమ విషయాన్ని హీరోయిన్‌తో చెప్పలేకపోతూ ఎంతో మదన పడుతుంటాడు.
ఈ సన్నివేశం చాలా మందికి మింగుడుపడలేదు. అమితాబ్ కూడా చివరి నిమిషంలో కూడా హీరో తన ప్రేమను హీరోయిన్‌తో చెప్పలేకపోవడంతో కోపంతో తన కారు తాళపు చెవిని స్క్రీన్‌వైపు విసిరేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ వెనక్కి తిరిగి హీరో దగ్గరకు రాగానే.. అమితాబ్ పక్కనే కూర్చున్న జయా బచ్చన్ మేడమ్ సంతోషంలో చప్పట్లు కొట్టేశారని కరుణాకరన్ గుర్తు చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో ‘గగనానికి ఉదయం ఒకటే…’ సాంగ్ కోసం ప్రత్యేకంగా సముద్రం ఒడ్డున తాజ్‌మహల్ సెట్ వేశారు. అయితే ఈ సెట్ కి భారీగా ఖర్చవ్వడంతో పవన్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నారని చెబుతూ ఉంటారు.