Ananya Nagalla: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అనే సామెత గుర్తుండే ఉంటుంది కదా.. సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి పదాలు బాగా యాప్ట్ అవుతాయి. కొందరికి మంచి హైట్, ఫిజిక్, యాక్టింగ్ టాలెంట్ ఉన్నా కానీ ఎందుకో క్లిక్ అవరు. మరికొంత మంది కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అనవసరపు నిర్ణయాలు తీసుకుని ఫేడౌట్ అయిపోతుంటారు.
అనన్య నాగళ్ల.. ఈ అచ్చతెలుగమ్మాయిలో హీరోయిన్స్ ఫీచర్స్ కొట్టొచ్చినట్టు కనబడుతుంటాయి. ‘మల్లేశం’, ‘ప్లే బ్యాక్’ సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లో యాక్ట్ చేసింది. ఇంకేముంది టాలీవుడ్ బ్యూటీస్ టాప్ లిస్ట్‌లో చేరిపోతుందనుకున్నారంతా..
ఎక్కడ తేడా కొట్టిందో కానీ.. అనుకున్నంత ఆశ్చర్యంగా అయితే కెరీర్ ముందుకు కదల్లేదు. లేటెస్ట్ ఫొటోషూట్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో హీటెక్కిస్తుంటుంది అనన్య. అమ్మడు చేసే యోగా, వర్కౌట్స్ మొదలుకుని గ్లామర్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. ఎలాంటి రోల్ అయినా చేస్తా, క్యారెక్టర్ కోసం గ్లామర్ డోస్ పెంచడానికి కూడా రెడీ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా మేకర్స్‌కి హింట్ ఇస్తున్నా కానీ అమ్మడికి ఎందుకు సరైన ఆఫర్లు రావడం లేదో తెలియడం లేదు. ‘‘హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని పరువాలు నీ సొంతం.. ఫోకస్ చేస్తే పెద్ద యాక్ట్రెస్ అవుతావ్’’ అంటూ నెటిజన్లు అనన్యకు సలహాలిస్తూనే.. ‘‘పాపం పాపని పట్టించుకోండయ్యా’’ అని మేకర్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CgYYFzqKRO3/
Leave a comment