నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఇప్పటికే 100కు పైగా సినిమాల్లో నటించడు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోల్లోనే బాలకృష్ణ సూపర్ పామ్‌లో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. బాలకృష్ణ సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల విషయంలోనూ అందరికంటే ముందు వరుసలో ఉంటారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య రెండు రోజుల క్రితం కూడా ఒక బాలుడికి రూ.50వేల పైగా సాయం చేశాడు.
అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నాడు. అయితే బాలయ్యకు ఇప్పటివరకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ రాలేదనే సంగతి తెలిసిందే.బాలయ్య పద్మభూషణ్, పద్మవిభూషణ్ లకు అర్హుడు కాదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నరు. బాలయ్య కెరీర్ లో నంది అవార్డులు ఉన్నాయి.. ఫిలింఫేర్ లు ఉన్నాయి. కానీ జాతీయ అవార్డ్ కానీ, పద్మ పురస్కారం కానీ లేదు. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొంత పార్టీ అధికారంలో ఉన్నా కానీ పైరవీలు చేయించుకోరు కాబట్టి బాలయ్యకు పురస్కారాలు రాలేదని .బాలకృష్ణ గారికి కేవలం రాజకీయాల వల్ల ఆయనకు అందాల్సిన సత్కారాలు దూరం అవుతుంటే కోట్లాది నందమూరి అభిమానులకు బాధగా ఉంది. ఆనాడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారికి అన్యాయం చేశారు. ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణకి అన్యాయం చేస్తున్నారు అని ఆవేదన వెలిబుచ్చారు.
ఎన్నో గొప్ప పాత్రలకు జీవం పోసిన లెజెండరీ నటుడు ఎన్టీఆర్ కి పద్మశ్రీ మినహా జాతీయ అవార్డ్ లేదు.. భారతరత్నకు సిఫారసు లేదు..! ఇతరులతో పోలిక అవసరం లేదు కానీ ఇండస్ట్రీ కోసం బాలయ్య పడిన కష్టం అంతా ఇంతా కాదు. బాలయ్య తను చేసిన సహాయాలను చెప్పుకోవడానికి ఎప్పుడు ఇష్టపడరు. బాలయ్యకు భవిష్యత్తులో అయినా పద్మ పురస్కారాన్ని ప్రకటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. బాలయ్య పద్మ పురస్కారాలకు అర్హుడని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.