Rajamouli – Anupam Kher: దర్శకధీరుడు రాజమౌళి తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా సినిమాకీ తనతో తానే పోటీ పడుతూ.. ప్రతి సినిమాకీ కొత్తగా ఏదోటి నేర్చుకుంటూ.. ప్రేక్షకులను సరికొత్త ఫీల్‌ని, థ్రిల్‌ని కలిగిస్తుంటారాయన.
‘మగధీర’, ‘ఈగ’ లాంటి సినిమాల్లో గ్రాఫిక్స్ చూసి తెలుగు సినిమాల్లో ఈ రేంజ్ సీజీ వర్కా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ‘బాహుబలి’ (రెండు పార్టులు), ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, గౌరవాన్ని తీసుకొచ్చారు.
రీసెంట్గా సీనియర్ బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, రాజమౌళిని కలిశారు. ఇద్దరూ చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా జక్కన్నను మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు అనుపమ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రాజమౌళి.. అనుపమ్ శాలువా కప్పుతుంటే మొహమాటపడ్డారు.
‘‘ప్రియమైన రమాజీ మరియు రాజమౌళి మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.. హైదరాబాద్‌లోని మీ నివాసంలో పెట్టిన రుచికరమైన భోజనానికి థ్యాంక్స్.. సాంప్రదాయకంగా శాలువా కప్పి మీ ఇంట్లోకి మిమ్మల్ని స్వాగతించడాన్ని చాలా సంతోషించాను. ఐ లవ్ యువర్ సింప్లీసిటీ అండ్ హ్యుమిలిటీ.. ఐ ఫీల్ బ్లెస్డ్.. మీనుంచి చాలా నేర్చుకోవాలి’’ అంటూ అనుపమ్ ట్వీట్ చేశారు.
Leave a comment